Manchu Family Disputes : మంచు కుటుంబంలో జరుగుతోన్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్‌బాబు, మనోజ్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి లేఖలను విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్‌తో తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే కుటుంబంలో జరుగుతున్న వివాదాలపై మోహబాబు మీడియాతో మాట్లాడారు. ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమని, ఇంటి గొడవలను అంతర్గతంగా పరిష్కరించుకుంటారని తెలిపారు. తమ ఇంట్లోనూ అలాంటి విభేదాలు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తాను పరిష్కరించినట్లు వివరించారు. చాలా కుటుంబాలు కలిసేలా చేశానని మోహన్‌బాబు వెల్లడించారు.
Mohan Babu on Family Issues: మరోవైపు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు నివాసంలో చర్చలు జరిపారు. తెలంగాణలోని జల్‌పల్లిలోని ఆయన నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. సోమవారం పెద్ద మనుషుల సమక్షంలో మోహన్‌బాబు, మనోజ్ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేడు విదేశాల నుంచి విష్ణు తిరిగి రావడంతో మరోసారి ఈ ముగ్గురూ చర్చలు నిర్వహించారు.
మంచు కుటుంబంలో రచ్చ రచ్చ - అర్ధరాత్రి వారిని ట్యాగ్ చేస్తూ మనోజ్ ట్వీట్