ETV Bharat / state

జగన్ రాజీనామాతో పులివెందులకి మరో ఎమ్మెల్యే : ఎమ్మెల్సీ భూమిరెడ్డి - MLC BHUMIREDDY ON MLC ELECTION

పలు నియోజక వర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపిన వైఎస్సార్సీపీ

MLC Bhumireddy Ram Gopla Reddy About YSRCP Boycott Graduates Constituency MLC Election
MLC Bhumireddy Ram Gopla Reddy About YSRCP Boycott Graduates Constituency MLC Election (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 12:46 PM IST

MLC Bhumireddy Ram Gopla Reddy About YSRCP Boycott Graduates Constituency MLC Election : ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్‌కు తెలిసినట్లు మరెవరికీ తెలియదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమిరెడ్డి మాట్లాడారు. గౌతమ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీశారు. ఎన్నికల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి రాకుండా జగన్‌కు రాజకీయ పార్టీ ఎందుకని మండిపడ్డారు. పులివెందులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆయనకు జీతమెందుకన్నారు. వెంటనే రాజీనామా చేస్తే పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం సిగ్గుచేటని భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.

కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ గురువారం ప్రకటించింది. ఆ పార్టీ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా మతలబులే ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఓ వైపు పరువు దక్కించుకోవడంతో పాటు మరోవైపు తమ ప్రత్యర్థి అయిన అధికార టీడీపీను దెబ్బకొట్టవచ్చనే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఆ మూడు స్థానాలను గెలుచుకోవాలని అన్ని ప్రయత్నాలూ చేసింది.

"ఎన్నికల్లో పోటీకే భయపడే పరిస్థితి" - ఘోర పరాభవాన్ని మర్చిపోలేకపోతున్న వైఎస్సార్సీపీ

ఓటర్ల నమోదులో ఎప్పుడూ వినని, చూడని అక్రమాలకు పాల్పడింది. అయినా మూడు చోట్లా వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. మొన్నటి ఫలితమే పునరావృతమైతే మరింత పతనమవుతాం. పోటీ నుంచి తప్పుకొంటే కనీసం పరువైనా దక్కుతుంది. మరోవైపు అరాచకాలు చేస్తున్నారంటూ టీడీపీపై నిందలూ మోపవచ్చు. పైగా తెలుగు దేశం పార్టీకి మరింత బలంగా పోటీనిచ్చేలా పీడీఎఫ్‌నకు పరోక్షంగా దోహదపడొచ్చని. తద్వారా టీడీపీని దెబ్బకొట్టొచ్చు అనే యోచనతోనే ఎన్నికలను బహిష్కరించిందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. దీనిపై అప్పటికే పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు ఖరారు - ఇద్దరి పేర్లు ప్రకటించిన అధిష్ఠానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.