MLAs on SP Gangadhar Issue : అసెంబ్లీ లాబీలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వ్యవహారంపై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగిందని సమాచారం. అంగళ్లు ఘటనలో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టే విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాంటిది గంగాధర్‌కు కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారని చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధానాలతో అంటకాగిన అధికారిగా ఎస్పీకి పేరుందని రాయలసీమకు చెందిన నేతలు చెప్పినట్టు సమాచారం.
Angallu Case in AP : అంగళ్లు ఘటనలో అనేకమంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టింది గంగాధరే అని పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబూరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన కృష్ణా జిల్లాకు ఎస్పీగా వచ్చినప్పటి నుంచి కొడాలి నానికి అనుకూలంగా పని చేస్తున్నారని నేతలు ఆరోపించారు. కొడాలి నాని పీఏని ఎవరో కొడితే, గంటల వ్యవధిలో ఎస్పీ అతని వద్దకు వెళ్లి కేసు పెట్టమని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఇంకా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో గంగాధర్ ఉన్నారేమోనని వారు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.
వల్లభనేని వంశీ, కొడాలి నానిల అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించారాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారని సమాచారం. గుడివాడలో వైఎస్సార్సీపీ భూ స్థాపితం అయిందని శానససభ సభ్యుడు వెనిగండ్ల రాము అన్నారు. కొడాలి నాని ఎప్పుడు అక్కడికి వచ్చినా ప్రజలే తిరగబడేలా ఉన్నారని చెప్పినట్టు తెలుస్తోంది.