MLA Medipalli Satyam Wife Suicide in Hyderabad : కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బలవన్మరణానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన భార్య రూపాదేవి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల కాలనీలో నివసిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పనులు చేసేందుకు గురువారం ఉదయమే చొప్పదండి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఆయన భార్య వికారాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఇరువురు 12 ఏళ్ల క్రితం మేడిపల్లి సత్యంతో ప్రేమ వివాహం జరిగింది. ఆమె గురువారం వారు నివాసముంటున్న పంచశీల కాలనీలో ఉన్న శ్రీ చక్ర అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
భార్యను కొట్టిన భర్త- భయంతో కాసేపటికే ఆత్మహత్య!
CONGRESS MLA WIFE SUICIDE IN HYDERABAD : ఎమ్మెల్యే భార్య చనిపోయిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష నిర్వహించారు. తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె కుటుంబసభ్యులు అల్వాల్‌లోని ఇంటికి తరలించారు. అనంతరం తిరుమలగిరి డెయిరీఫామ్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుటుంబసభ్యుల నుంచి పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించి నమోదు చేసుకున్నారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ వాంగ్మూలంలో ఉందని వెల్లడించారు.
MLA Satyam Wife Suicide Reason : రూపాదేవి చనిపోయినప్పుడు ఆమె తల్లి, కుమారుడు, కుమార్తె ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. భార్య మరణించిందని తెలిసి ఎమ్మెల్యే రక్తపోటు తగ్గిపోవడంతో అల్వాల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆస్పత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూపాదేవి మరణం పట్ల సంతాపం తెలిపారు.
నువ్వులేని లోకంలో నేనుండలేను, బుల్లితెర త్రినయని జోడీ అకాల మరణం - Trinayani chandrakanth and Pavitra