ETV Bharat / state

మానసిక వికాసానికి, ప్రకృతితో మమేకానికి యోగా గొప్ప సాధనం : మంత్రి సత్యకుమార్ - health minister SATYAKUMAR

International Yoga Day Celebrations in AP 2024 : యోగా శారీరక ప్రక్రియే కాదని శరీరం, మనసుతో మమేకం అయ్యేందుకు ఓ గొప్ప సాధనమని మంత్రి వై.సత్యకుమార్‌ పేర్కొన్నారు. యోగాను జీవనశైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేమని ఆయన తెలిపారు.

Minister Satya Kumar at Yoga Day Celebrations
Minister Satya Kumar at Yoga Day Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 3:22 PM IST

Minister Satya Kumar at Yoga Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా పదో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ప్రతిరోజు ప్రాణాయామం, యోగా చేస్తే మంచి జీవితాన్ని పొందొచ్చని పలువురు సూచించారు. తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు. మన దేశ ప్రధాని యోగాను దేశంలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపింపజేసి దీని విశిష్టతను చాటారని తెలిపారు. ఇది శారీరిక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వంను అందిస్తుందని పేర్కొన్నారు. కుల, మతాలకు సంబంధం లేకుండా మనుసులందర్ని ఏకం చేయగలిగేది యోగా మాత్రమేనని వారు చెప్పారు.

మానసిక వికాసానికి, ప్రకృతితో మమేకానికి యోగా గొప్ప సాధనం : మంత్రి సత్యకుమార్ (ETV Bharat)

International Yoga Day Celebrations in AP : యోగా శారీరక ప్రక్రియే కాదని మానసిక వికాసానికి, శరీరం, మనసు, ప్రపంచం, ప్రకృతితో మమేకం కావడానికి ఓ గొప్ప సాధనమని వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ తెలిపారు. ఊపిరి ఉన్నంత వరకు దృఢంగా శక్తివంతంగా ఉండాలనేది స్వామి వివేకానంద చెప్పిన సూత్రమని అన్నారు. విజయవాడలో రాష్ట్ర ఆయుష్‌ శాఖ ఏర్పాటు చేసిన పదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

దేశాన్ని యోగా గురువుగా మోదీ తీర్చిదిద్దారు : ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ పలు యోగాసనాలు వేశారు. ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవనశైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేమని ఆయన అన్నారు. దేశాన్ని యోగా గురువుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 థీమ్ మహిళా సాధికారత కోసం, ఆడవారు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించడమే లక్ష్యంగా నిర్దేశించారని సీఎం రమేష్ వెల్లడించారు.

ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొలిక‌పూడి శ్రీనివాస్‌, ఎన్‌.ఈశ్వర‌రావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ ఎస్‌.ఢిల్లీరావు, ప్రకృతి వైద్యులు డాక్టరు మంతెన స‌త్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.

34 ఏళ్లుగా ఉచితంగా శిక్షణ - అందరికీ యోగా నేర్పుతున్న పెరుమాళ్ల దత్తయ్య - Free Yoga Training

మంచుకొండల్లో, యుద్ధనౌకలపై సైనికుల ఆసనాలు- కాశ్మీరంలో మోదీ- దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం - international yoga day

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.