ETV Bharat / state

"తగ్గేదేలేదు" త్వరలో రెడ్​బుక్​ మూడో చాప్టర్ ఓపెన్ - వాళ్లకి కచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి లోకేశ్

అమెరికాలోని అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్ - హెలికాప్టర్ నుంచి గులాబీ పూలు చల్లిన అభిమానులు

minister_nara_lokesh_unveiled_statue_of_ntr_in_atlanta_of_america
minister_nara_lokesh_unveiled_statue_of_ntr_in_atlanta_of_america (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Minister Nara Lokesh Unveiled Statue of NTR in Atlanta of America : రెడ్ బుక్​లో ఇప్పటికే రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని సూచించారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాను కూడా ఒక బాధితుడునే అన్న లోకేశ్, యవగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులు గురి చేశారని తెలిపారు.

అమెరికాలోని అట్లాంటాలో పర్యటించిన మంత్రి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అట్లాంటా NTR ట్రస్టు ఆధ్వర్యంలో 14 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై అభిమానులు పూలు చల్లారు. తెలుగు నేలకు అభివృద్ధి అంటే ఏంటో చూపించింది ఎన్టీఆరేనని తెలిపారు. ఆయన ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చేశారని లోకేశ్ కొనియాడారు. NTR ఆశయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.

రెడ్ బుక్ కి ఇప్పుడు భయపడుతున్న సైకో, గుడ్ బుక్ తీసుకువస్తానని తెలిపినట్టు గుర్తుచేశారు. కానీ ఆ నోట్ బుక్​లో ఏమి రాయాలో జగన్​కు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కలుపుకొని ముందుకు తీసుకుళ్తేనే రాష్ట్రం ముందుకు వెళుతుందన్న లోకేశ్, పెట్టుబడులు కూడా రాష్ట్రానికి తీసుకువెళ్లాలన్నారు. ప్రజలు మనపై గురుతరమైన బాధ్యత పెట్టారన్న సంగతి ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని లోకేశ్ సూచించారు.

గూగుల్ క్లౌడ్ సీఈవోతో లోకేశ్ భేటీ - విశాఖలో డాటా సెంటర్ల ఏర్పాటుపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం అమెరికాలో ఎంతో మందిని కలిశా కానీ ఈ సభ తనకు సూపర్ కిక్ ఇచ్చిందని లోకేశ్ చెప్పారు. ప్రవాసులను అందరూ NRI అని పిలుస్తారు కానీ మేం మాత్రం మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్‌(MRI) అని పిలుచుకుంటామని లోకేశ్ కొనియాడారు. ఉపాధి అవకాశాల కోసం రెండు సూట్ కేసులు సర్దుకుని అమెరికా వచ్చినా మీ ఆలోచన అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనే ఉందన్నారు. జగన్‌ను ఇంటికి పంపడంలో ప్రవాసాంధ్రుల కృషి ఎంతో ఉందన్నారు. కూటమి పార్టీ గెలుపు ఏ ఒక్కరిదో కాదని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారిదన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుక్‌అవుట్‌ నోటీసులు ఇచ్చినా వాటన్నింటికీ వెరవకుండా NRI లు నిలబడ్డారని లోకేశ్ ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కోమటి జయరాం సహా పెద్ద సంఖ్యలో ప్రవాస ఆంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ అట్లాంటా నుంచి అభివృద్ధి చెందిన తాను, గుడివాడకు ఎంతో కొంత చేయాలనుకునే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్​కు ఉన్నాంత ఖ్యాతి మరెవరికీ లేదన్నారు. గత ఐదేళ్లగా తెలుగు ప్రజలు పడ్డ బాధలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తీరిపోయాయని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేశ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ చేసిన పనులు చేయాలంటే ఎవరికైనా గట్స్ ఉండాలన్నారు. ఆయన రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని వెనిగండ్ల రాము ప్రశంసించారు.

'ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్'​లో పాల్గొన్న మంత్రి లోకేశ్ - ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కసరత్తు

ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వైరల్ - షాక్ ఇచ్చిన అధికారులు - లోకేశ్ చొరవతో మళ్లీ విధుల్లోకి

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.