ETV Bharat / state

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా పర్యటన - అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు

శాన్‌ఫ్రాన్సిస్కో విమానశ్రయంలో మంత్రి లోకేశ్​కు ఘన స్వాగతం పలికిన ఐటీ సర్వ్, ఎన్నారై, టీడీపీ ప్రతినిధులు

NARA_LOKESH_US_TOUR
NARA_LOKESH_US_TOUR (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2024, 12:07 PM IST

Minister Nara Lokesh to Visit US to Attract Industrial Investments in AP : రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రముఖులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారు ఓ వెలుగు వెలుగుతున్నారంటే అందుకు టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లనే అని ఎన్నారై ప్రముఖులు కొనియాడారు. భారత దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ హైటెక్ సిటీ పేరు చెప్పగానే చంద్రబాబు గుర్తుకు రాక మానరని వ్యాఖ్యానించారు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 అంటూ ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు అని తెలియజేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రి లోకేశ్‌ 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎన్నారై ప్రముఖులు కొనియాడుతున్నారు.

లోకేశ్‌కు ఘన స్వాగతం : తన తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు ఐటీ రంగంపై చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను కూడా లోకేశ్‌ పుణికి పుచ్చుకున్నారని ఎన్నారైలు కొనియాడారు. ఈ ఖర్చునే ఏపీలో పెట్టుబడుల కోసం ఆయన ఇవాళ ( అక్టోబర్​ 26న) నుంచి అమెరికాలో ఉంటారు. ఈ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో లోకేశ్‌కు ఘన పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

మరో హామీని నెరవేర్చిన నారా లోకేశ్ - సంబరాలు చేసుకున్న ప్రజలు

ఫుల్ జోష్‌లో ఎన్నారై నేతలు : ఆంధ్రప్రదేశ్​లో ఎన్డీఏ కూటమి ‘అఖండ’ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. టీడీపీ ఘన విజయం సాధించడంతో పార్టీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మంగళగిరి ఎన్నికల్లో ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టి తిరుగులేని విజయం సాధించి మంత్రి అయిన లోకేశ్‌కు టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇన్‌ఛార్జి రవి మందలపు, ఐటి సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్‌ మండువ, సురేశ్‌ మానుకొండ తదితరులు లోకేశ్​కు ఘన స్వాగతం పలికారు.

ఏపీలో పెట్టుబడులకు దక్షిణ కొరియా సంస్థల ఆసక్తి - మంత్రి లోకేశ్​తో భేటీ

అమెరికాలో లోకేశ్​ పర్యటన : అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తారు. ఈ నెల 29న లాస్‌వేగాస్‌ (Las Vegas) నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడులు పెట్టేలా పలు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ఎన్నారై టీడీపీ నేతలు, అభిమానులు, ఎన్నారైలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.

లోకేశ్ దిల్లీ టూర్ అప్డేట్స్ - 'ఇతర రాష్ట్రాలతో కాదు- దేశాలతోనే మాకు పోటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.