Minister Nara Lokesh Praja Darbar Restart Soon : విదేశీ పర్యటన ముగించుకురావటంతో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ మళ్లీ పునప్రారంభం కానుంది. కష్టాల్లో ఉన్నవారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ కన్నీరు తుడుస్తున్నారు. సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ప్రజా దర్బార్ సాగుతోంది. సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా సమస్యలను విన్నవించిన వారికి మంత్రి లోకేశ్ సత్వర పరిష్కారం చూపుతున్నారు. స్వయంగా వినతులు తీసుకుంటూ ఇప్పటివరకు 45 ప్రజాదర్బార్‌లు నిర్వహించారు. ప్రజల నుంచి 4వేల753 విజ్ఞప్తులను స్వీకరించి 2వేల 219 సమస్యలకు పరిష్కారం చూపారు.
విన్నపాల్లో సగానికి పైగా రెవెన్యూ, హోంశాఖకు సంబంధించిన సమస్యలే వచ్చాయి. విజ్ఞప్తుల త్వరితగతిన పరిష్కారానికి మంత్రి చొరవ తీసుకుంటున్నారని బాధితులు సంతోషం వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సమస్యలపై స్వయంగా మంత్రులతో మాట్లాడి సంబంధిత శాఖల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని లోకేశ్ కోరారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అప్పటివరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు లోకేశ్ అందించారు.
లోకేశ్‌పై భరోసా - ప్రజాదర్బార్‌కు తరలివస్తోన్న ప్రజలు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జరిగిన మంత్రి నారా లోకేశ్ వారం రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో శుభవార్త చెబుతామనే సంకేతాలు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో దారి తప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టే దిశగా సాగిన మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగేస్తుందని పలువురు తెలుపుతున్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ది లక్ష్యంగా సాగడంతో పాటు ఆ దిశగా చర్యలు చేపట్టంతో తమ ఆశలు చిగురిస్తున్నాయని ప్రజలు తెలుపుతున్నారు.
ఏపీకి బ్లూప్రింట్‌తో వచ్చే పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. విజనరీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల వాతావరణం (ఎకో సిస్టమ్) ఏర్పాటు చేసిందని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు సైతం అందిస్తోందని మంత్రి తెలిపారు.
నారా లోకేశ్ ప్రజాదర్బార్ - వివిధ సమస్యలతో బాధితుల రాక - Nara Lokesh Praja Darbar