Minister Lokesh Praja Darbar 22nd Day In Undavalli : ఉండవల్లిలో మంత్రి లోకశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువెత్తాయి. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు జోరువానను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. 22వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రతీ ఒక్కరి కష్టాన్ని విన్న మంత్రి ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా ఇంటిని కూల్చేసిందని బాధితులు లోకేష్ వద్ద వాపోయారు. వారసత్వంగా వచ్చిన మూడెకరాల అసైన్డ్ భూమిని వైఎస్సార్సీపీ అండతో కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. సీఆర్డీఏ (Capital Region Development Authority) పింఛన్ కోసం వినతిపత్రం అందించారు.
నారా లోకేశ్ 21వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. అందులో తమ భూములు కబ్జాకు గురయ్యాయని, ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని కోరుతూ పలువురు లోకేశ్‌కు విన్నవించారు. గత ప్రభుత్వంలో అర్హత ఉన్నా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, పెన్షన్ తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ హోం గార్డులు, అప్కాస్ ఉద్యోగులు లోకేశ్‌ను కోరారు. సమస్యల సత్వర పరిష్కారానికి లోకేశ్ భరోసా ఇచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజాసమస్యలను నాయకులు పట్టించుకోలేదని లోకేశ్ మండిపడ్డారు.
ప్రజాదర్బార్ వేదికగా ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందిచడమే తమ అంతిమ లక్ష్యమని ఇంతకు ముందు తెలిపిన విషయం విధితమే. దానికు తగినట్లే కార్యచరణ సాగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ ప్రజా దర్భర్లానే పలు జిల్లాల్లో టీడీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు భరోసా అందిస్తున్నారు.