ETV Bharat / state

వరద సహాయక చర్యలపై లోకేశ్ సమీక్ష - బాధితులకు అందుతున్న సాయంపై ఆరా - Lokesh Review Flood Relief - LOKESH REVIEW FLOOD RELIEF

Lokesh Review Flood Relief : రాష్ట్రంలో వరద సహాయక చర్యలపై మంత్రి లోకేశ్ నిరంతరం సమీక్ష చేస్తున్నారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ శాఖల మంత్రులు, అధికారులకు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు.

Lokesh Review Flood Relief Operations
Lokesh Review Flood Relief Operations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 11:46 AM IST

Flood Relief Operations in AP : ఏపీలో వరద సహాయక చర్యలపై వివిధ శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి నారా లోకేశ్​ సమన్వయం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆయన పర్యవేక్షణలో విజయవాడ బాధితులకు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ సంస్థలు ఆహారాన్ని పంపిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. సోమవారంతో పోల్చితే ఈరోజు ఉదయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల పైగా వరద తగ్గుముఖం పట్టిందని వివరించారు.

Vijayawada Floods 2024 : బాధితుల కోసం ఐదు హెలికాప్టర్లు, 174 బోట్లు, డ్రోన్లు పనిచేస్తున్నాయని లోకేశ్ తెలిపారు. వాటి ద్వారా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారికి ఆహార పదార్థాల సరఫరా చేస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 2,000ల కిలోమీటర్ల ఆర్అండ్​బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 25 చోట్ల రహదారులకు కోతలు ఏర్పాడ్డాయన్నారు. అదేవిధంగా 1,80,244 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. మరోవైపు 43,417 మంది నిరాశ్రయులు అయ్యారని పేర్కొన్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి కావల్సిన సౌకర్యాలను అందిస్తున్నట్లు లోకేశ్ వివరించారు.

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం - ఊళ్లకు ఊళ్లే నీటమునక - Flood Effect in Joint Guntur

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.