ETV Bharat / state

ఖరీఫ్ సీజన్‌కు పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యాం : మంత్రి అచ్చెన్నాయుడు - Atchannaidu on Agriculture Sector

Minister Atchannaidu on Kharif Season : ఏపీలో ఖరీఫ్ సీజన్ కోసం 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని ఆదేశించామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి 14 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయని చెప్పారు. మిగిలిన ఎరువులు సకాలంలో అందించేలా అధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు.

Atchannaidu on Agriculture Sector
Atchannaidu on Agriculture Sector (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 10:45 AM IST

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యాం (ETV Bharat)

Atchannaidu on Agriculture Sector : ఏపీలో ఖరీఫ్ సీజన్‌కు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదు కావటం శుభసూచికమన్నారు. ఉపాధిహామీలో పంట కాలువలు పూడిక తీసేందుకు తక్షణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పంట పొలాల్లో నీటి నిల్వ తొలగింపు, తేమ ద్వారా ఆశించే తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు చేస్తున్నామని వివరించారు. అమరావతిలోని వెంకటపాలెెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి 14 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయని తెలిపారు. మిగిలిన ఎరువులు సకాలంలో అందించేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

"ఉపాధి హామీలో పంట కాల్వల పూడిక తీసేందుకు తక్షణ చర్యలు చేపట్టాం. పొలాల్లో నీటినిల్వ తొలగింపు, తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలిచ్చాం. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాం. 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని ఆదేశించాం. ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి 14 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయి. మిగిలిన ఎరువులు సకాలంలో అందించేలా ఆదేశాలిచ్చాం." - అచ్చెన్నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి

రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి: మంత్రి అచ్చెన్నాయుడు - Minister Review With Officials

ధరల నియంత్రణపై మంత్రి అచ్చెన్న సమీక్ష- రైతు బజార్లను బలోపేతం చేయాలని ఆదేశాలు - Minister Atchannaidu review meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.