Minister Achchennaidu Review on Fisheries Department: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం 40 శాతం నిధులు కూడా చెల్లించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో మత్స్యశాఖపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కేరళలో 27 కిలో మీటర్లకు ఒక హర్బర్, గుజరాత్లో 87 కిలో మీటర్లకు ఒక హర్బర్ ఉంటే ఏపీలో మాత్రం 258 కిలో మీటర్లకు ఒక హర్బర్ ఉందన్నారు. ఈ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటే బాధాకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. రెండోసారి 4 హార్బర్లను వైసీపీ ఎమ్మెల్యే కుటుంబీకులకు ఇచ్చారని మండిపడ్డారు.
మాత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతిని గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పరులకు ఇవ్వలేదన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ఎవరికి అయితే భృతి అందలేదో వారి ఇవ్వడంతో పాటు అనర్హులను గుర్తించి వారిని తొలగిస్తామన్నారు. మత్స్యకార భృతిపై అధికారులు సర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే మత్స్యకారులకు డీజిల్పై సబ్సిడీ 10 కోట్ల బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లించాలని అధికారులను ఆదేశించామన్నారు. 2014-19 వరకు మత్స్యశాఖలో అమలు చేసిన పథకాలు మళ్లీ అమలు చేస్తామని పెర్కొన్నారు. మత్స్యశాఖలో నెలకొన్న పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లతామన్నారు.
మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. గత ప్రభుత్వంలో ఈ శాఖ ఉందని కూడా ఎవరికీ తెలియదు. గత ప్రభుత్వం 5 హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారు. రెండోసారి 4 హార్బర్లను వైసీపీ ఎమ్మెల్యే కుటుంబీకులకు ఇచ్చారు. గత ప్రభుత్వం టీడీపీ సానుభూతిపరులకు భృతి ఇవ్వలేదు. మత్స్యకార భృతిపై అధికారులు సర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.10 కోట్లు బకాయి ఉంది వెంటనే ఆ రాయితీ బకాయిలను చెల్లించాలని ఆదేశించాం. - అచ్చెన్నాయుడు, మత్స్యశాఖ మంత్రి
ఓడిన వైకల్యం- ఈ యువ క్రికెటర్ల సంకల్పానికి విజయం దాసోహం! - Deaf and Dumb Cricket Players