ETV Bharat / state

విజయవాడలో 14 మెడికల్​ రిలీఫ్​ క్యాంపులు - అత్యవ‌స‌ర మందుల కిట్లు పంపిణీ - Medical relief Camps - MEDICAL RELIEF CAMPS

Medical relief Camps in Flooded Areas : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో ముంపున‌కు గురైన విజ‌య‌వాడలోని వివిధ ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్లు, అత్యవ‌స‌ర మందుల కిట్ల పంపిణీ చేస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 14 శిబిరాల్లో అత్యవ‌స‌ర మందుల కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు.

Medical relief Camps in Flooded Areas
Medical relief Camps in Flooded Areas (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 6:18 PM IST

Medical Relief Camps in Flooded Areas : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో దాదాపు 75వేల అత్యవ‌స‌ర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింద‌ని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి కృష్ణబాబు తెలిపారు. గ‌న్నవ‌రం ఎయిర్ పోర్టు నుంచి ఫుడ్ ప్యాకెట్ల‌తో పాటు కొన్ని అత్యవ‌స‌ర మెడిక‌ల్ కిట్లను హెలీకాప్టర్ ద్వారా అధికారులు పంపించార‌న్నారు.

న‌గ‌రంలో ఏర్పాటు చేసిన 14 మెడిక‌ల్ రిలీఫ్ క్యాంపులకు అత్యవ‌స‌ర మందుల కిట్లను అధికారులు చేర‌వేశార‌న్నారు. మ‌రికొన్ని కిట్లను 10 మొబైల్ మెడిక‌ల్ వాహ‌నాల‌ ద్వారా చేర‌వేశార‌న్నారు. ఏపీఎంఎస్, ఐడీసీ నుంచి 50వేల కిట్లు, డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి 25 వేల కిట్లు పంపిణీ చేసేందుకు చ‌ర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Flood Relief Operations in Vijayawada : ఆరు ర‌కాల మందులతో పాటు ఎలా వాడాల‌న్న వివ‌రాల‌తో క‌ర‌ప‌త్రాల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య స‌మ‌స్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కృష్ణబాబు తెలిపారు. 24 గంట‌ల వైద్య సేవ‌లు అందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, విక‌లాంగుల ఆరోగ్యం ప‌ట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల‌ని స్పష్టమైన ఆదేశాలిచ్చామ‌న్నారు. 10 వేల అత్యవ‌స‌ర మెడిక‌ల్ కిట్లను హెలీకాప్టర్ ద్వారా బాధితుల‌కు అందించేందుకు చ‌ర్యలు తీసుకున్నామ‌ని వివరించారు.

రంగంలోకి డ్రోన్లు - బోట్లు, హెలికాప్టర్లు వెళ్లలేని ప్రాంతాల్లోనూ ఆహార సరఫరా - Food Distribution Through Drones

Distribution Of Food And Medicine to Flood Victims : బోట్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్ల‌తో పాటు బాధితుల‌కు అత్యవ‌స‌ర మందుల కిట్లను పంపిణీ చేసేందుకు చ‌ర్యలు తీసుకున్నామ‌ని చెప్పారు. ఆరోగ్య స‌మ‌స్యల విష‌యంలో బాధితులు ఎలాంటి ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదని, రేయింబ‌వ‌ళ్లూ సేవ‌లందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలిచ్చామ‌న్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటిక‌ప్పుడు జారీ చేసే సూచ‌న‌లు, స‌ల‌హాల్ని బాధితులు పాటించాల‌ని కృష్ణబాబు కోరారు. సమస్యాత్మక పరిస్థితులు ఎదురైన ప్రతీ ఒక్కరు హెల్ప్​లైన్​ను సంప్రదించాలని తెలిపారు.

సహాయక చర్యలు ముమ్మరం- వరద బాధితులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ - Flood relief operations in ap

Food Supply with Drones: డ్రోన్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వీటి ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ఈ డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్‌ వేదికగా ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. ఓ మినీ హెలికాప్టర్‌లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువును మోయగలవు? ఏయే ప్రదేశాల వరకు వెళ్లగలవు? మార్గంలో ఎక్కడైనా చెట్లు, స్తంభాలు వంటివి వస్తే ఎలా తప్పించుకొని వెళ్లి రాగలవు? తదితర అంశాలను పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.