ETV Bharat / state

భగ్గుమన్న దోమల మందు - ఎగిసిపడిన అగ్నికీలలు

నెల్లూరు జిల్లా వైద్యారోగ్య కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం

Fire Accident in Nellore district
Fire Accident at medical and health department (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 3:38 PM IST

Fire Accident in Nellore district : వైద్యారోగ్య శాఖ కార్యాలయ భవనం వద్ద భారీగా అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. భారీగా ఎగసిపడిన మంటల వల్ల కార్యాలయంలో కొన్ని వస్తువులు నాశనం అయ్యాయి. ఒక్క సారిగా అగ్నికీలలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఇదీ జరిగింది: నెల్లూరు నగరంలోని జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం పక్కనే ఉన్న భవనంలో భారీగా మంటలు అంటుకున్నాయి. పాత భవనంలోని మలేరియా శాఖకు చెందిన పరికరాలు కొన్ని మంటల్లో దగ్ధం అయ్యాయి. దోమలకు పిచికారీ చేసే ఆయిల్ కు నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మలేరియా శాఖకు చెందిన భవనంలో ఐదు ట్యాంకుల ఆయిల్ మండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. నగరంలో కిలోమీటరు దూరం వరకు ఈ పొగలు వ్యాపించి చుట్టు పక్కల ఇళ్లవారు సైతం ఇబ్బందులు పడ్డారు. ఎవరో కావాలనే నిప్పుపెట్టి ఉంటారనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో దస్త్రాలు ఏమీ లేవని జిల్లా అధికారి పెంచలయ్య తెలపడం గమనార్హం.

Fire Accident at medical and health department: ఘటానాస్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కార్యాలయంలో ఉన్న ముడి సరుకులకు మంటలు అంటుకొని ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నామని కొందరు భావిస్తున్నారు. మలేరియా పూరిత దోమలను నివారించే నూనెకు ఒక్కసారిగా మంట అంటుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. కొంతమేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వారు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడివారు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - లక్షల్లో ఆస్తి నష్టం - Rajam Fire Accident Today

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - 8 మందికి గాయాలు - Blast in Fire Crackers Factory

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.