ETV Bharat / state

కర్ణాటకలోని చిక్​బళ్లాపూర్​ లో మార్గదర్శి చిట్స్ 115వ బ్రాంచ్ ప్రారంభం - Margadarsi Branch at Chikkaballapur - MARGADARSI BRANCH AT CHIKKABALLAPUR

కర్ణాటకలోని చిక్​బళ్లాపూర్​లో మార్గదర్శి నూతన బ్రాంచ్ ప్రారంభం - కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ శైలజాకిరణ్

Margadarsi Branches Opened in Chikkaballapur
Margadarsi Branches Opened in Chikkaballapur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 3:12 PM IST

Updated : Oct 7, 2024, 4:23 PM IST

Margadarsi Branches Opened in Chikkaballapur : తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ కర్ణాటకలోని చిక్​బళ్లాపూర్​ నూతన బ్రాంచ్​ని ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్. ప్రారంభ కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి నగదు స్వీకరించిన శైలజా కిరణ్ రశీదును అందించారు.

మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు. బ్యాంకులతో పోలిస్తే సులభంగా తాము డబ్బును పొందుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలిచిందని కొనియాడారు. వేల కుటుంబాలు చిట్స్ కడుతున్నాయన్న ఖాతాదారులు డబ్బు తీసుకునేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని స్పష్టం చేశారు. మార్గదర్శి సంస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు. పేర్కొన్నారు.

కోయంబత్తూరులో మార్గదర్శి చిట్​ ఫండ్​ 114వ బ్రాంచ్​ ప్రారంభం - Margadarsi Chit Fund 114th Branch

"మార్గదర్శి చిట్‌ఫండ్‌115 వ బ్రాంచ్‌ను చిక్‌బళ్లాపూరలో ప్రారంభించాం. ఇది కర్ణాటకలో 24 వ బ్రాంచ్‌. చిక్‌బళ్లాపూరలో బ్రాంచ్‌ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత పురోగాభివృద్ధిలో మేమూ భాగస్వాములం అవుతాం. ఇకపై ఈ ప్రాంత ఇంటింటి సంస్థగా మార్గదర్శి మారబోతోంది. ఈ ఏడాది అక్టోబర్‌1కి మార్గదర్శి 62 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మంచి వ్యక్తుల్ని మార్గదర్శి సంస్థ ఖాతాదారులుగా ఎంచుకోవడంతో పాటు ఎగవేతలు అతి తక్కువ ఉండేలా మేము చూడగలం. వ్యక్తిగత, వృత్తిపర అభివృద్ధికి ప్రత్యామ్నాయ పెట్టుబడి అందించే సంస్థగా అత్యుత్తమ సేవల కోసం ఖాతాదారులు మార్గదర్శిపై ఆధారపడొచ్చు. ఇంటి నిర్మాణం, పిల్లల వివాహం, కుమార్తె చదువుకు లేదా వ్యాపార వృద్ధికి పెట్టుబడులకు అందించేందుకు నిజమైన మిత్రుడిలా ఉంటాం. " - శైలజాకిరణ్‌, మార్గదర్శి ఎండీ

మున్నేరు వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన మార్గదర్శి సంస్థ - MARGADARSI CHIT FUND PRIVATE

'ఖాతాదారులే దేవుళ్లు వారికి సేవ చేయడమే మన విధి' - రామోజీ తారకమంత్రం ఇదే - అందుకే మార్గదర్శి సక్సెస్ - MARGADARSHI CHITFUNDS STORY 2024

Last Updated : Oct 7, 2024, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.