MANGO ICE CREAM : మామిడిని ఐస్ క్రీంలా ఎప్పుడైనా తిన్నారా? సహజంగా మామిడిపండునే ఐస్ క్రీమ్ మాదిరిగా తినాలనుకుంటే మాత్రం విశాఖ ఆర్గానిక్ మేళాను సందర్శించాల్సిందే. విశాఖకు చెందిన కొంగర రమేష్ అనే రైతు అభివృద్ది చేసిన అమృతం అనే రకానికి చెందిన మామిడి పండు తిన్నవారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. మామిడి పండును పుల్ల ఐస్ మాదిరిగా తినడం ఏంటో చూద్దామా!
ఏకాలంలో నైనా తినేందుకు వీలుగా : అక్కడకి వెళ్లిన వారంతా మామిడి పండు పుల్ల ఐస్ తింటుంటారు. అయితే వాళ్లు తింటున్నది మాత్రం మామిడి పండు. పుల్ల ఐస్ మాదిరిగా ఎంచక్కా లాగించేస్తున్నారు. ఇది ఏకాలంలో నైనా తినేందుకు వీలుగా, నిల్వ ఉంచి మరీ విక్రయిస్తున్నారు. విశాఖలో నిర్వహిస్తున్న ఐదవ ఆర్గానిక్ మేళాలో ఈ మామిడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం నీళ్ల కుండీలు వద్ద ఉన్న రైతు కొంగర రమేష్ దాదాపు మూడు దశాబ్దాలుగా అమృతం రకం మామిడిని పండిస్తున్నారు. అమృతం రకం మామిడిపై రకరకాలైన ప్రయోగాలు చేసి చివరికి ఇది రంగు రుచి మారకుండా నిర్దేశిత ఉష్టోగ్రతలో నిల్వ చేయగలిగితే ఎంతో చక్కగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ మామిడిని పుల్ల ఐస్ మాదిరిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. గత పదేళ్లుగా ఈ రకమైన మామిడిని పుల్ల ఐస్ మాదిరిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆర్గానిక్ మేళాలో ఓ ప్రధాన అకర్షణగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. వచ్చిన వారంతా మామిడి పండు ఐస్క్రీంని రుచి చూసేట్టుగా చేస్తోంది. ఈ మామిడిని రుచి చూసిన వారు కూడా లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఆర్గానిక్ పద్దతిలో పండించిన ఈ అమృతం రకం మామిడి విదేశాలకు ఎగుమతికి కూడా ఎంతో అవకాశం ఉందని రైతు చెబుతున్నారు.
"అమృతం మ్యాంగో చాలా బాగుంది. మామూలుగా తినే మామిడి కంటే ఇది చాలా స్వీట్‌గా, టేస్టీగా ఉంది. దీనిని కొత్తరకంగా తయారు చేశారు. దీనిని ఖచ్చితంగా అభినందించొచ్చు. మామిడి పండు తిన్నట్లే ఉంది. ఇంకా ఏంటి అంటే ఇది ఏ సీజన్లో అయినా వస్తోంది కాబట్టి, ఇదో ఎంజాయ్‌మెంట్‌గా ఉంది". - సందర్శకులు
ఆకాశంలో సైకిల్ తొక్కొచ్చు - పక్షిలా ఎగరొచ్చు - విశాఖలో ఇవి అస్సలు మిస్ కావద్దు
ఒకే మామిడి చెట్టుకు 20 రకాల కాయలు - కేవలం కుండీ ఉంటే చాలు!
మోకాళ్ల నొప్పులకు భలే మందు - బ్రెస్ట్ క్యాన్సర్‌కి ది బెస్ట్ ఫ్రూట్! - Lychee Fruit Benefits