ETV Bharat / state

వైసీపీలో మళ్లీ ఇన్​ఛార్జ్​ల మార్పులు - మచిలీపట్నం ఎంపీ బరిలో సింహాద్రి చంద్రశేఖరరావు

Machilipatnam YSRCP MP Candidate: వైసీపీలో ఇన్​ఛార్జ్​ల మార్పుల పరంపర కొనసాగుతోంది. అవనిగడ్డ వైసీపీ ఇన్‌ఛార్జిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, మచిలీపట్నం ఎంపీ బరిలో రమేష్‌బాబును నిలబెడుతున్నట్లు ఇటీవల వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చంద్రశేఖర్‌రావు విముఖత వ్యక్తం చేయడంతో మరోసారి మార్పులు చేసింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు చంద్రశేఖర్‌రావును మచిలీపట్నం పార్లమెంట్‌ సమన్వయకర్తగా, రమేష్‌బాబును అవనిగడ్డ ఇన్‌ఛార్జిగా నియమించారు.

Machilipatnam_YSRCP_MP_Candidate
Machilipatnam_YSRCP_MP_Candidate
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 10:34 AM IST

Machilipatnam YSRCP MP Candidate: వైసీపీలో ఇన్​ఛార్జ్​ల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు మార్పుచేర్పులు చేస్తూ వైసీపీ అధిష్ఠానం వస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలో మరోసారి అభ్యర్థులను మార్చింది. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు (Simhadri Chandrasekhar Rao) కొత్తగా తెరపైకి వచ్చారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ సింహాద్రి చంద్రశేఖరరావు పేరును అధికారికంగా ప్రకటించారు.

మచిలీపట్నం సిటింగ్‌ ఎంపీగా వల్లభనేని బాలశౌరి వైసీపీను వీడి జనసేనలో చేరిపోయారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి పలువురి పేర్లను పరిశీలించిన వైసీపీ పెద్దలు తొలుత క్రికెటర్‌ అంబటి రాయుడిని అక్కడికి పంపేందుకు ప్రయత్నించారు. ఆయన విముఖత చూపడంతోపాటు వైసీపీనూ వీడారు. ఆ తర్వాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం లోక్‌సభ సమన్వయకర్తగా జనవరి 31వ తేదీన వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఎమ్మెల్యేగానే కొనసాగాలని రమేష్‌ భావించినా ఆయనని బలవంతంగా మచిలీపట్నానికి మార్చారు. అదే రోజు రమేష్‌ (Simhadri Ramesh Babu) స్థానంలో అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ను నియమించారు.

వైఎస్సార్సీపీ 9వ జాబితా విడుదల - మంగళగిరి సమన్వయకర్తలతో దాగుడుమూతలు

రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వైద్య వృత్తిలో మంచి ఉన్నత స్థితిలో ఉన్న చంద్రశేఖర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు విముఖత చూపారు. పేరును ప్రకటించాక కూడా కొంతకాలం ఆయన స్పందించలేదు. పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు మాట్లాడారు. చివరకు ఆయన కుమారుడు రాంచరణ్‌ను బరిలోకి దింపేందుకు ఒప్పించారు. తర్వాత చంద్రశేఖర్‌ తన తనయుడిని వెంటబెట్టుకుని సీఎం జగన్‌ను కలిశారు. అవనిగడ్డలో తన కుమారుడు పోటీ చేయబోతున్నట్లు సీఎంను కలిసిన అనంతరం చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు.

అయితే టీడీపీ-జనసేన పొత్తు, సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి వచ్చాక మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ అయితే రాజకీయంగా, సామాజికంగా బాగుంటుందని ఉంటుందని భావించిన వైసీపీ (YSRCP) పెద్దలు ఆయన్ను మచిలీపట్నం తీసుకువచ్చేందుకు మళ్లీ ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్‌ స్వయంగా చంద్రశేఖరరావును పిలిపించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని ఒప్పించారు. సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) పిలిచి అడిగినందుకు సమ్మతి తెలిపానని సింహాద్రి చంద్రశేఖర్‌ గురువారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. ఇంతకాలం మచిలీపట్నం లోక్‌సభ సమన్వయకర్తగా ఉన్న సింహాద్రి రమేష్‌ను తిరిగి ఆయన సొంత నియోజకవర్గం అవనిగడ్డకు మార్చినట్లు గురువారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

అభ్యర్థుల మార్పుపై 24 గంటల్లోనే మాట మార్చిన జగన్‌- 5నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.