ETV Bharat / state

లోక్‌సభ స్థానాల్లోనూ దూసుకుపోయిన కూటమి - 21స్థానాల్లో విజయదుందుభి - Loksabha Election Result in AP - LOKSABHA ELECTION RESULT IN AP

Loksabha Election Result in AP : రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ సీట్లలోనూ కూటమి సత్తా చాటింది. 21 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. దీనిలో తెలుగుదేశం 16 సీట్లలో విజయం సాధించగా జనసేన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది. బీజేపీలో ఆరింటిలో మూడు స్థానాల్లో జయభేరి మోగించగా వైఎస్సార్సీపీ నాలుగు ఎంపీ సీట్లకే పరిమితమైంది.

mp_result_ap
mp_result_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 12:10 PM IST

Loksabha Election Result in AP : ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అప్రతిహత విజయం కైవసం చేసుకుంది. 21 లోక్​సభ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. పొత్తులో భాగంగా టీడీపీ 17 చోట్ల పోటీ చేసింది. ఒక్క కడప మినహా మిగిలిన అన్నిచోట్లా జెండా ఎగురవేసింది. కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో పోటీ చేసిన జనసేన రెండింటిలోనూ విజయబావుటా ఎగురవేసింది. మరోవైపు పొత్తులో భాగంగా బీజేపీ ఆరు స్థానాల్లో పోటీచేసి అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాలను గెలుచుకుంది. అరకులోయ, తిరుపతి, రాజంపేట స్థానాలను కోల్పోయింది. వైఎస్సార్సీపీ నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. దీంతో 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైఎస్సార్సీపీ లోక్ సభ సీట్ల విషయంలో కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్లయింది.

శాసనసభ అభ్యర్థులతో పోలిస్తే లోక్​సభ అభ్యర్ధులకు క్రాస్ ఓటింగ్ జరగడంతో నాలుగు స్థానాలను వైఎస్సార్సీపీ సాధించుకోగలిగింది. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ ప్రస్తుతం నాలుగింటికే పరిమితం కావాల్సి వచ్చింది. అదే సమయంలో టీడీపీ బలం బాగా పుంజుకుంది. అప్పట్లో మూడు స్థానాలే గెలుచుకున్న టీడీపీ ప్రస్తుతం 16 స్థానాలు పొందింది.

జనాగ్రహానికి నేలకరిచిన నియంత - కుప్పకూలిన జగన్‌ నిరంకుశ రాజ్యం - YSRCP Defeat In Assembly Elections

లోక్‌సభ స్థానాల్లోనూ దూసుకుపోయిన కూటమి - 21 స్థానాల్లో విజయదుందుభి (ETV Bharat)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి గెలుపొందారు. ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్‌ అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్‌ నాయుడు వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఘన విజయం సాధించారు. విశాఖపట్నం నుంచి మతుకుమిల్లి శ్రీభరత్‌ 5 లక్షలకు పైగా మెజార్టీతో సత్తా చాటారు.

లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్ అమలాపురం నుంచి జయభేరి మోగించారు. కాకినాడ నుంచి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ కుమార్‌, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాసవర్మ విజయదుందుభి మోగించారు. ఏలూరు లోక్​సభ నియోజకవర్గం నుంచి పుట్టా మహేష్‌ యాదవ్‌, విజయవాడ నుంచి కేశినేని శివనాథ్‌ గెలుపొందారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి వరుసగా రెండోసారి సత్తా చాటారు. గుంటూరు నుంచి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్‌, బాపట్ల నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్‌ విజయం సాధించారు.

దేశం దాటుతున్నCID Chief సంజయ్ -భయపడి పారిపోతున్నాడంటూ ట్రోలింగ్‌ - AP CID Chief Sanjay On Leave

రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి నెల్లూరు లోక్​సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన విజయసాయిరెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు విజయం సాధించారు. అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం నుంచి బీకే పార్థసారధి సత్తా చాటారు. చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు గెలుపొందారు.

నోటి మాటలకు ఓటు దెబ్బ - రాజకీయ విమర్శ శ్రుతిమించితే భరించలేమని జనం తీర్పు - YSRCP Ministers Used Bad Words

అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి తనూజా రాణి గెలిచారు. రాజంపేట నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఓడించారు. తిరుపతి నుంచి గురుమూర్తి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. కడప నుంచి వైఎస్సార్సీపీ నేత అవినాష్‌రెడ్డి మూడోసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా ఉండి ఈ ఎన్నికల్లో లోక్‌సభ బరిలోకి వచ్చిన అనిల్‌కుమార్‌ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ , కిలారి వెంకట రోశయ్య ఓటమి పాలయ్యారు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్సీపీ లో చేరిన రాపాక వరప్రసాద్ అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అనిల్ ఔట్! కోతల నేతకు ఓట్లతో వాతలు - YSRCP Leader Anil Kumar Yadav

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.