Liquor Supply with Fake Hologram Stickers? : ఎక్సైజ్ శాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్ మాల్ చేశారని ఆరోపించారు. మద్యం, బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్‌మాల్ జరిగిందని నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం టెండర్లను పక్కదారి పట్టించినట్లు అభియోగాలు ఉన్నాయి.
హోలోగ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. హోలోగ్రామ్‌ల పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే టెండర్లు ఇచ్చినట్లు, హోలోగ్రామ్ కంపెనీలకు ఏపీఎస్‌బీసీఎల్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి టెండర్లు కట్టబెట్టినట్లు విచారణలో తేటతెల్లమైంది. జీఎస్టీ లావాదేవీల సమాచారం లేకుండానే కట్టబెట్టారని, గత వ్యాపార వివరాలు లేకుండా టెండర్లు కట్టబెట్టినట్లు విచారణలో స్పష్టమైంది. హోలోగ్రామ్ టెండర్ల కీలక సమాచారం గల్లంతవడంతో పాటు టెండర్ల ఖరారులో సాంకేతిక కమిటీ నివేదికపై అధీకృత సంతకాలు లేనట్లు గుర్తించారు. సాంకేతిక కమిటీ సమావేశం మినిట్స్ కూడా గల్లంతైనట్లు గుర్తించారు.
నెలన్నరగా అజ్ఞాతంలో వాసుదేవరెడ్డి - చర్యలు ఎప్పుడు ? - Former APSBCL MD Absconded