ETV Bharat / state

ప్రాణాలు అరచేతిలో - కొండచరియల్లో బిక్కు బిక్కుమంటున్న జనాలు - Houses damaged cause landslides

Landslide At Andhra Pradesh In Vijayawada People Fear : వర్షాకాలం వస్తుందంటే ఆ ప్రాంత వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియని దుస్థితి. కొండచరియల రూపంలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందని విజయవాడలోని కొండ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

landslide_at_vijayawada
landslide_at_vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 1:25 PM IST

ప్రాణాలు అరచేతిలో - కొండచరియల్లో బిక్కు బిక్కుమంటున్న జనాలు (ETV Bharat)

Landslide At Andhra Pradesh In Vijayawada People Fear : విజయవాడలో దాదాపు 2 లక్షల మంది వరకు కొండలపై నివాసం ఉంటున్నారు. గుణదల, మొగల్రాజపురం, వన్​టౌన్, గాంధీపర్వతం, సొరంగ మార్గం, కబేళ, గిరిపురం ఇలా కొండ ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కొండపైకి వెళ్లాలంటే మెట్ల దారి కూడా లేని పరిస్థితి. ఇక్కడ నివసించేవారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారే.

వీరి నుంచి కార్పొరేషన్​ ఇంటి పన్నులు వసూలు చేస్తుంది కానీ వారి జీవితాలకు రక్షణ మాత్రం కల్పించలేకపోతుంది. వర్షాకాలంలో విజయవాడ నగరంలో కొండచరియలు విరిగి ఇళ్లపై పడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కొండచరియలు పడి మృతి చెందినవారు, గాయాలపాలైనవారూ ఉన్నారు. దీంతో వర్షాకాలం అంటేనే కొండ దిగువ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వాళ్లు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరంభానికి ముందే అదరగొడుతున్న రుతుపవనాలు- భారీ వర్షాలు,పిడుగులతో అతలాకుతలం - Rain Disaster in AP

'ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు చేపడతామంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కాలం వెల్లదీశారని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రుపాయి, రుపాయి కూడబెట్టుకుని ఇల్లు నిర్మించుకుంటే కొండచరియలు విరిగిపడి కూలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఏటా ఈ ప్రమాదం పెరుగుతూనే ఉంది. దీంతో ప్రాణనష్టం కూడా జరుగుతున్నా ఎవరూ పట్టించికోలేదు. అద్దెలు చెల్లించే స్థోమత లేక కొండ ప్రాంతంలో ఉంటున్నాం. ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నా ఏ అధికారులు పట్టించుకోవడం లేదు.' - డేవిడ్ రాజు, స్థానికుడు, కె. సరోజ, మాజీ కార్పోరేటర్​, దుర్గ, స్థానికురాలు

Landslide In Vijayawada : కొండ ప్రాంతాల్లో రక్షణ గోడ ఏర్పాటు చేసి స్థానికుల ప్రాణాలు రక్షించాలని కోరుతున్నారు. చినుకు పడితే చాలు విజయవాడలోని కొండ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోంది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడి ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియటం లేదని ఆ ప్రాంత ప్రజలు తమ గోడు వినిపిస్తున్నారు. విజయవాడలో కొండలపై సుమారు 3 లక్షల మంది వరకు నివాసం ఉంటున్నారు. సమస్యలపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ చరియలు విరిగిపకుండా ఫెన్సింగ్ లేదా వాల్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం- పలు జిల్లాలో భారీ వర్షాలు - Heavy Rains in Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.