ETV Bharat / state

రోగులకు శాపంగా గత పాలకుల నిర్లక్ష్యం - అసౌకర్యాలతో అల్లాడుతున్న గిరిపుత్రులు - Lack of Facilities in Govt Hospital - LACK OF FACILITIES IN GOVT HOSPITAL

Lack of Facilities in Govt Hospital: గత పాలకుల నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవటంతో రోగులు నానావస్థలు పడుతున్నారు. పడకలు సరిపోక ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్స చేయటంపై పార్వతీపురం మన్యం జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Lack_of_Facilities_in_Govt_Hospital
Lack_of_Facilities_in_Govt_Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 2:22 PM IST

Lack of Facilities in Parvathipuram Govt Hospital: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రభుత్వాసుపత్రులు సమస్యలకు నిలయాలుగా మారాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆసుపత్రుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతున్నా పాలకులు పట్టించుకోలేదు. భవన నిర్మాణాలు పూర్తి చేయకపోవడం గిరిపుత్రులకు శాపంగా మారింది.

మన్యం జిల్లాలోని ఆసుత్రుల్లో గత ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోలేదు. సీహెచ్​సీ స్థాయి 30 నుంచి 50 పడకలకు పెరిగినా సమస్యలు తీరలేదు. మూడేళ్ల కిందట 9 కోట్ల రూపాయలతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ వాటిని ఇంకా పూర్తి చేయలేదు.

ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు! - 40 Affected by Diarrhea in Guntur

రోజుకు సుమారు 200 వరకు ఓపీలు వస్తున్నాయి. 50 నుంచి 60 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. పడకలు సరిపోక ఇద్దరు, ముగ్గురు ఒకే మంచంపై పడుకుని చికిత్స తీసుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఇటీవల వర్షాలకు గ్రామాల్లో జ్వరాలు పెరిగాయని మన్యం వాసులు వాపోతున్నారు. ఆస్పత్రికి వస్తే సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. విద్యార్థులు కూడా తరచూ జబ్బున పడుతున్నారని వాపోతున్నారు. త్వరగా ఆసుపత్రి భవన నిర్మాణాలను పూర్తి చేసి పడకల సంఖ్యను పెంచాలని వేడుకుంటున్నారు.

కాగా రాష్ట్రంలో ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇటీవల తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టమని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా ముందుకెళుతున్నామన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు.

కనీస సౌకర్యాలు లేని ఒంగోలు సర్వజన ఆస్పత్రి - ఆందోళనలో రోగులు - Lack Of Facilities in Ongole GGH

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.