ETV Bharat / state

"ఆగిపోతే అడవిలోనే" - కర్నూలు - గుంటూరు హైవేపై వాహనదారుల అవస్థలు - DAMAGED ROADS IN NANDYAL DISTRICT

గుంతలమయంగా కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి

Damaged Roads in Nandyal District
Damaged Roads in Nandyal District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 8:00 AM IST

Roads Damaged in Nandyal District : పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారైంది కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి పరిస్థితి. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు అడుగుకో గుంతతో వాహనాలకు ఆహ్వానం పలుకుతోంది. అధ్వానంగా తయారైన రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. నరకదారిలో నిత్యం వాహనాలు మరమ్మతులకు గురై ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు-గుంటూరు రోడ్డును కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి- 340సీగా గుర్తించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ప్రకాశం జిల్లా దోర్నాల మధ్య ఈ రహదారి 58 కిలోమీటర్లు ఉండగా అందులో 40 కిలో మీటర్లు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఘాట్‌రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని డ్రైవర్లు వివరిస్తున్నారు. వెంకటాపురం- రోళ్లపెంట మధ్య ఇదే పరిస్థితి నెలకొంది.

Kurnool - Guntur NH Damaged : దోర్నాల మండలం కొర్రప్రోలు వరకు, బైర్లూటి- రామయ్యకుంట మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా వాహనాలు కిందికి దిగలేని పరిస్థితి నెలకొంది. రోళ్లపెంట సమీపంలో కిలోమీటరు మేర గుంతలు ఏర్పడ్డాయి. నల్లమడుగులపెంట గేట్‌ కుదుపు రస్తా వరకు ఇలానే ఉంది. వెంకటాపురం- సంజీవనగర్‌తండా మధ్య పల్లెకట్ల సమీపంలో పెద్ద గుంత ప్రమాదకరంగా మారింది. తాత్కాలికంగా వేసిన కంకర రాళ్లు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయాయి.

"గత ఐదేళ్లుగా ఈ రోడ్డు ఇలానే ఉంది. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడి అధ్వాన్నంగా ఉంది. ఈ రహదారి వెంబడి రోజు వాహనాలు దెబ్బతింటున్నాయి. గుంతలు పూడ్చాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం ఎలానో దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వమైన రోడ్లు మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం" - వాహనదారులు

గార్గేయపురం నుంచి ఆత్మకూరు మండలం పిన్నాపురం వరకు 74 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డును ప్రతిపాదించారు. ప్రస్తుతం నన్నూరు టోల్‌ప్లాజా నుంచి ఆత్మకూరు వరకు రూ.1200 కోట్ల వ్యయంతో సుమారు 72 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరిస్తున్నారు. పిన్నాపురం నుంచి ప్రకాశం జిల్లా కొత్తూరు వరకు 39 కిలోమీటర్లు విస్తరించడానికి. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 2017-2018లో సర్వే చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కారు రహదారి పనులను అటకెక్కించింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఘాట్‌రోడ్‌ ప్రయాణంలో నిత్యం నరకం తప్పడం లేదని వాహనదారులు వాపోతున్నారు.

Vijayawada Sercice Roads in Damaged Condition: బెజవాడలో అధ్వాన్నంగా సర్వీసు రోడ్లు.. వర్షం పడితే రెండు మూడు రోజులు చెరువులే..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం - ఆంధ్ర-ఒడిశాను కలిపే రహదారి అధ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.