Krishnapatnam Port Neglected: సీఎం జగన్ అసమర్థ పాలనతో కొత్త పరిశ్రమలు ఎలానూ రావు. ఉన్నవాటిని నిలుపుకోవడమూ చేతకాదు. ఇప్పటికే చాలా పరిశ్రమలను తరిమేసి యువత ఉపాధికి జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. అది చాలదు అన్నట్లు ఇప్పుడు పోర్టులను దెబ్బతీయాలని చూస్తున్నారు.
వైఎస్సార్ పార్టీ నిర్వాకంతో కృష్ణపట్నం పోర్టు ద్వారా సరకు రవాణా గణనీయంగా పడిపోయింది. ఆశించిన స్థాయిలో వ్యాపారం లేదంటూ, కంటైనర్ టెర్మినల్‌ను పాక్షికంగా ఉపసంహరించాలని పోర్టు యాజమాన్యం అదానీ సంస్థ నిర్ణయించింది. పోర్టు ఆగిపోతే పన్నుల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పడిపోతుంది. అంతేకాకుండా ఆ ప్రభావం వేలాది మంది ఉపాధిపైనా ప్రభావం పడనుంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ ద్వారా, 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య ఏటా 6 లక్షల మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. దీని ద్వారా ఏటా 9లక్షల కోట్ల టర్నోవర్ జరిగి పన్నుల రూపేణా రాష్ట్రానికి సుమారు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేది.
పడిపోయిన ఎగుమతులు దిగుమతులతో ఆదాయానికి గండి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కృష్ణపట్నం పోర్టులో నీలినీడలు కమ్ముకున్నాయి. 2019-21 మధ్య ఎగుమతులు, దిగుమతులు 4 లక్షల మిలియన్ టన్నులకు పడిపోయాయి. 2021 సంవత్సరం మధ్య జరిగిన ఎగుమతులు, దిగుమతులు మరింత పడిపోయి, ప్రస్తుతం ఏడాదికి లక్ష మిలియన్ టన్నులకు మించి సరకు రవాణా జరగడం లేదు. దీనివల్ల టర్నోవర్ ఏడాదికి లక్షన్నర కోట్లకు తగ్గింది. దీనిపై రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 150 కోట్లకు పడిపోయింది.
దేశవిదేశాల ఎగుమతులు దిగుమతిలు: కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రధానంగా శ్రీలంక, అమెరికా, చైనా, సింగపూర్‌కు దేశాలకు, బియ్యం, పొగాకు, గుంటూరు మిర్చి, పత్తి, రొయ్యల ఎగుమతి అవుతున్నాయి. చైనా, మలేసియా, దుబాయ్, థాయ్‌లాండ్ నుంచి శ్రీసిటీలోని మోటారు పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలతో పాటు, వివిధ పరిశ్రమలకు అవసరమైన పేపర్‌రోల్స్, ఫర్నిచర్, రసాయనాల దిగుమతి జరుగుతోంది.
cm jagan: రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్దిపై సీఎం జగన్ సమీక్ష
వైఎస్సార్సీపీ తీరుతో కంటైనర్ రవాణా ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 850 కోట్లు రాష్ట్రం నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని అవకాశంగా చేసుకుని కంటైనర్ టెర్మినల్‌ను బల్క్ కార్గోకు వినియోగించుకోవాలని అదానీ సంస్థ భావిస్తోంది. కంటైనర్ టెర్మినల్‌ను ప్రస్తుతం పాక్షికంగా ఉపసంహరించాలని నిర్ణయించింది. టెర్మినల్‌కు ఇరువైపులా ప్రస్తుతం హుక్‌లు ఉన్నాయి. అందులో ఒకవైపు ఉన్న రెండు హుక్‌లను వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. వాటిని అదానీ సంస్థకు తమిళనాడులో ఉన్న కాటుపల్లి, ఎన్నూరు పోర్టుల్లో వినియోగించుకోనుంది.
కంటైనర్ టెర్మినల్ తరలింపుతో రాష్ట్రానికి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం నష్టపోతున్నా జగన్ పట్టించుకోరా అని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
రెండు పోర్టులు.. నాలుగు చేపల రేవుల అభివృద్ధి
"వేల ఎకరాలు భూములిచ్చి ప్రజలు నిర్వాసితులయ్యారు. పోర్టు వస్తుందని అనుకుంటే బూడిద మిగులుతోంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఆదాయం పడిపోతోంది. పోర్టు ఎందుకు పోతోంది అని కనీసం సమీక్ష చేసే దిక్కు లేదు ముఖ్యమంత్రికి." - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ నేత
కృష్ణపట్నం టెర్మినల్ ద్వారా ఏటా 8 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉన్న కంటైనర్ల ఎగుమతులకు అవకాశం ఉంటే రెండేళ్లుగా లక్ష యూనిట్ల సామర్థ్యానికి మించి కంటైనర్లు రావడం లేదు. చెన్నైలోని పోర్టుల నుంచి నెలకొన్న పోటీ వల్ల కంటైనర్ రవాణా ఆశించిన స్థాయిలో లేదు. దీని వల్లే టెర్మినల్‌ను పాక్షికంగా ఉపసంహరించాలని యాజమాన్యం నిర్ణయించిందని పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు.
రెండున్నర ఏళ్లలో ఆ మూడు పోర్టులు పూర్తికావాలి : సీఎం జగన్