Kinjarapu Rammohan Naidu Took Charge as Civil Aviation Union Minister : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు.
అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పౌరవిమానయాన బాధ్యత అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్‌లో అత్యంత చిన్న వయస్సులో ఉన్న తపై బాధ్యత పెట్టారని, యువతపై ప్రధానికి ఉన్న నమ్మకమేంటో అర్థమవుతుందని కొనియాడారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. సాంకేతికత వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా స్పష్టం చేశారు. విమానాశ్రయాల నిర్మాణానికి నిధులను త్వరితగతిన తీసుకుంటామని తెలిపారు.
విమానయాన రంగాన్ని సామాన్యులకు మరింత చేరువ చేస్తాం: రామ్మోహన్ నాయుడు - Civil Aviation Minister
భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తాం : 2014లో బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు మంచి పునాదులు వేశారని, ఉడాన్ స్కీమ్ కూడా అశోక్ గజపతిరాజు హయాంలోనే వచ్చిందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. అనుభవం కోసం సింధియా నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నానని తెలిపారు. గత పథకాలను కొనసాగిస్తూ మరిన్ని పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా గర్వించేలా పని చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చారు. విజనరీ నాయకులు చంద్రబాబు, మోదీ నుంచి చాలా నేర్చుకున్నానని మరోసారి తెలిపారు.