Kadapa Court No One Talks Viveka Murder Case : వివేకా హత్య కేసు అంశంపై ఈ నెల 30వ తేదీ వరకు ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టులో వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా వివేకా హత్య కేసుపై పలువురు రాజకీయ నాయకులు ప్రచారంలో మాట్లాడుతున్నారని సురేష్ బాబు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధానంగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని పిటిషన్ వేయగా వారందరూ ఈనెల 30వ తేదీ వరకు వివేకా అంశాన్ని ప్రస్తావించవద్దని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
వివేకా హత్యలో భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకమైంది: సీబీఐ - Vivekananda Reddy Murder Case
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వివేకానంద హత్య కేసులో తన పాత్రపై పలువురు వ్యాఖ్యలు చేస్తూ హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. దస్తగిరి తమకు సమర్పించిన వినతిపై తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ విచారణను ఈనెల 23కి వాయిదా వేశారు.
వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీం నోటీసులు - viveka murder case
రానున్న ఎన్నికల్లో పిటిషనర్ పోటీ చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. ప్రతిష్ఠకు భంగం కలిగేలా రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా వారిని నిలువరించాలని, వాటిని ప్రసారం చేయకుండా టీవీ ఛానళ్లను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి వినతి ఇచ్చామన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. ఈసీ వివరాలు సమర్పించాక తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరిని, అతని కుటుంబాన్ని అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేసిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేసేలా పలు చర్యలకు పాల్పడ్డారని సీబీఐ వివరించింది.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దును కోరే హక్కు దస్తగిరికి ఉంది: హైకోర్టు - Viveka Murder Case