Janasena Leader P Hariprasad Took Certificate as MLC: జనసేన నేత పి.హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ధ్రువపత్రం తీసుకున్నారు. కౌన్సిల్‌కు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ అవకాశం కల్పించిన పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సి ఎన్నిక డిక్లరేషన్ తీసుకున్నారని ఇంకా ప్రమాణం చేయాల్సి ఉందని వెల్లడించారు. మొదటి సెషన్ ప్రారంభానికి కొంత సమయం ఉందని ఆ సమయాన్ని కౌన్సిల్ గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగించుకుంటానని అన్నారు. మండలిలో ప్రశ్నోత్తరాలు, చర్చలుపైనా స్టడీ చేస్తానని గతంలో కౌన్సిల్లో పనిచేసిన పెద్దల మార్గదర్శకత్వంలో ముందుకు వెళతానని స్పష్టం చేశారు.
పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభం: ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. లా చేసినప్పటికీ జర్నలిజంలో కొనసాగారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్‌కు విశేష అనుభవం ఉంది. సుమారు పాతికేళ్లపాటు మీడియా రంగంలో పని చేశారు. ఈనాడు, ఈటీవీ2లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. మాటీవీలో న్యూస్ హెడ్‌గా పని చేశారు. అదే ఛానల్‌లో కొద్దికాలం అసోసియేట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత సీవీఆర్ హెల్త్ ఛానల్, సీవీఆర్ హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా, సీవీఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్‌గా ఏకకాలంలో సేవలందించారు. జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్‌గా, పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.
ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు: ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన అభ్యర్థి పి.హరిప్రసాద్ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులూ లేవని వెల్లడించారు. హరిప్రసాద్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలివీ.
అఫిడవిట్: జనసేన తరఫున ఎన్నికైన హరిప్రసాద్ తన వద్ద రూ.26.10 లక్షల విలువచేసే 550 గ్రాముల బంగారం, 2019 మోడల్ స్విఫ్ట్ కారు, చేతిలో రూ.50 వేల నగదు, నాలుగు బ్యాంకుల్లోని నాలుగు ఖాతాల్లో మొత్తం రూ.6.51 లక్షలు ఉన్నాయని వివరించారు. మొత్తంగా తన పేరిట రూ.39.11 లక్షల విలువైన చరాస్తులు, రూ.49వేల బ్యాంకు రుణం ఉన్నట్లు వెల్లడించారు. తన భార్య పేరిట రూ.72.50 లక్షల విలువైన 1,550 గ్రాముల బంగారం, బీమా మొత్తం రూ.28 లక్షలు, నాలుగు బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.5.95 లక్షల నగదు ఉన్నాయని చూపారు. మైలవరం మండలం మొరుసుమిల్లిలో 3.76 ఎకరాల భూమి, కాకినాడ జిల్లా కరప మండలంలో 300, సామర్లకోట మండలంలో 240 చదరపు గజాల స్థలాలు ఉన్నాయని వీటన్నింటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.59.96 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి, మణికొండల్లో రూ.1.75 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆమె పేరిట రూ.39.98 లక్షల గృహ రుణం ఉందని తెలిపారు.
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు - ఆ కాలేజీల్లో ఎంతంటే? - ENGINEERING FEES in ap
రాజ్‌తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది : నటి లావణ్య - Lavanya on Hero Raj Tarun