Jagananna Land Resurvey Problems in AP : భూముల రీసర్వేలో తప్పులతడకల వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రీ సర్వే వివరాలను రైతులు వ్యతిరేకించినా అధికారులు మాత్రం వాటినే వెబ్ ల్యాండ్‌లో నమోదు చేశారు. పంట నమోదుకు వెబ్‌ల్యాండ్ ప్రామాణికం కావడం, భూముల సబ్ డివిజన్ వివరాలు అందులో లేకపోవడం వల్ల రైతులు ఈ-క్రాప్ నమోదు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
భూముల రీ సర్వేతో అన్నదాతల అవస్థలు : ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్వహించిన రీసర్వే వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అనంతపురం జిల్లాలో 31 మండలాల్లో 507 రెవెన్యూ గ్రామాలుండగా 198 గ్రామాల్లో రీసర్వే నిర్వహించారు. సత్యసాయి జిల్లాలో 32 మండలాల్లో 432 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 164 గ్రామాల్లో రీసర్వే జరిగింది. రీసర్వేలో సర్వే నంబర్, విస్తీర్ణం నమోదులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలన్నీ తప్పుగా నమోదు చేశారు. సర్వే నంబర్ వారీగా కమతాలను మాత్రమే కొలిచారు తప్ప, ఆయా సర్వే నంబర్‌లోని సబ్ డివిజన్ భూమి కొలతలు వేయలేదు. ఫలితంగా రైతుల మధ్య వివాదాలు తెలెత్తాయి. జగన్ ఫోటోతో ఇచ్చిన పాస్‌పుస్తకాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు పేరు మార్పు - ఇకపై 'ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్'
సబ్ డివిజన్ వివరాలు లేక కష్టాలు : గ్రామాల్లో భూముల వివరాలను కొత్తగా వెబ్ ల్యాండ్‌లో నమోదు చేశారు. గతంలో ఉన్న విస్తీర్ణాల వివరాల స్థానంలో రీ సర్వే వివరాలను నమోదు చేశారు. రీ సర్వేకు ముందు ఉన్న విస్తీర్ణాలు, రైతుల పేర్లు, ఫోటోలు మారిపోవడంతో 40% పైగా గ్రామాల్లో రైతుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. రీసర్వే తర్వాత రైతుల మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించడానకి గత ప్రభుత్వం మండలానికో డిప్యూటీ తహసీల్దార్‌ను నియమించింది.
ప్రజల సొమ్ము సర్వే రాళ్లపాలు- రూ.525 కోట్లు మంచినీళ్లలా వెచ్చించిన ఏపీఎండీసీ - LAND RESURVEY stones
సర్వం సమస్యలమయం : వివాదాలు పరిష్కారం చేయాల్సిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ రైతుల గోడును పట్టించుకోలేదు. తప్పుడు అంకెలు, పేర్లతో ఇచ్చిన పాస్‌పుస్తకాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ సర్వే నంబర్‌లో ఉన్న రైతులందరికీ కలిపి ఒకే ఎల్పీ నంబర్ కేటాయించడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. ఓ సర్వే నంబర్‌లో రైతుకు ఎంత భూమి ఉంది అనే వివరాలు లేని కారణంగా వ్యవసాయశాఖ పంట నమోదు చేయడం లేదు.
'మీకోదండం మాకొద్దు మేడం'- భూరక్ష పథకం అమలు కోసం అధికారుల తంటాలు