ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై ఆషాడం సందడి - అమ్మవారికి సారె సమర్పణ కోసం తరలుతున్న భక్తులు - Indrakeeladri Ashada Sare festival

Indrakeeladri Durgamma Ashadam Sare Celebrations : ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈరోజు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వైదిక కమిటీ, అర్చకులు అమ్మవారికి మొదటిసారె సమర్పించారు. అటు కనకదుర్గమ్మకు సారె తీసుకుని సామాన్య భక్తులు తరలివస్తున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 4:16 PM IST

Updated : Jul 6, 2024, 8:16 PM IST

Indrakeeladri Durgamma Ashadam Sare Celebrations
Indrakeeladri Durgamma Ashadam Sare Celebrations (ETV Bharat)

Indrakeeladri Durgamma Ashadam Sare Celebrations : విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడికాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లపాపలతో భక్తులు సారెను తీసుకుని సన్నిధికి తరలివస్తున్నారు. శ్రీక్రోధి నామసంవత్సరం ఆషాడమాసాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి వచ్చేనెల నాలుగో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వైదిక కమిటీ, అర్చకులు అమ్మవారికి ఆషాడ పవిత్రసారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతోపాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు, పదార్ధాలను తీసుకుని మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు.

గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం ఆఫీస్‌లో సీబీఐ సోదాలు - అదుపులో 8 మంది - CBI arrested Guntakal Railway DRM

ఆలయ ఈవో కె.ఎస్.రామరావు సతీసమేతంగా తొలిసారె తీసుకొచ్చిన పండితులు, వారి కుటుంబాలను సాదరంగా ఆహ్వానించారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని సుమంగళ ద్రవ్యాలను సమర్పించిన తర్వాత మల్లికార్జున మండపం ఆరో అంతస్తులుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారికి తీసుకొచ్చిన సారెను అర్చకులు స్వీకరించి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పండితులంతా అమ్మవారికి మంగళసూత్రాలను కానుకగా తయారు చేయించి ఈవో రామరావుకు అందించారు.

ఆషాడ సారె సమర్పణ కార్యక్రమంతోపాటు ఈరోజు నుంచే వారాహీ నవరాత్రులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈనెల 15వ తేదీ వరకు అమ్మవారికి పంచవారాహి మంత్రాలతో జపాలు, హోమాలు నిర్వహించనున్నారు. సస్యదేవతగా పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా వారాహీమాతను ఆషాడమాసంలో పూజిస్తామని పండితులు తెలిపారు. చాలా శాంతస్వరూపిణి, కరుణారసమూర్తి అయిన వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుందనేది భక్తుల నమ్మకం.

కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదు - Case Against on EX MLA Kodali Nani

విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో జరిగే ఉత్సావాల తేదీలను దేవస్థాన ఈవో రామరావు ఇదివరకే వెల్లడించారు. వచ్చేనెల నాలుగో తారీఖు వరకు ఇంద్రకీలాద్రి పై ఆషాఢ‌ మాస సారె మహోత్సవాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. అలాగే ఈ నెలలో(జులై) 19,20,21వ తేదిల్లో శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అదేవిధంగా దుర్గమ్మ సన్నిధిలో మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు చేస్తున్నామన్నారు. జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనంగా సమర్పిస్తారని చెప్పారు.

ఆ సమయంలో అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్న తరుణంలో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని తెలిపారు. అమ్మవారికి నివేదన సమయంలో సామన్య భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామన్నారు. సామాన్య భక్తులకు దర్శన సమయంలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేస్తున్నామని ఈవో రామరావు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సారె సమర్పణకు రానునున్నారని ఆలయ అధికారులు ముందుగా చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్‌-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway

Last Updated : Jul 6, 2024, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.