ETV Bharat / state

ఇండోసోల్‌ సంస్థ మనోళ్లదే - ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే దొచిపెట్టండి! - land lease to Indosol Company

Indosol Company Application for 18 Quartz Leases: సీఎం జగన్‌కు సన్నిహిత సంస్థకు ఎడాపెడా లీజులిచ్చేందుకు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద అనుమతులు ఇస్తున్నారు. షిర్టీసాయి ఎలక్ట్రికల్‌ సంస్థకు వైఎసార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్ష కోట్లు విలువ చేసే వివిధ ప్రాజెక్టులు కేటాయించింది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఉన్న ఇండోసోల్‌ సంస్థకూ లబ్ధి చేకూరేలా శరవేగంగా అనుమతులు లభిస్తున్నాయి. వేలం లేకుండా అడ్డగోలుగా కేటాయింపునకు సర్కార్‌ వెసులుబాటు ఇస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 క్వార్ట్జ్‌ లీజులకు ఆ సంస్థ దరఖాస్తు చేసుకోగా ఆమోదానికి ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.

Indosol_Company_Application_for_18_Quartz_Leases

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 7:39 AM IST

ఇండోసోల్‌ సంస్థ మనోళ్లదే - ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే దొచిపెట్టండి!

Indosol Company Application for 18 Quartz Leases : షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ మనోళ్లదే! ఇండోసోల్‌ (Indosol) దాని అనుబంధ సంస్థ. క్వార్ట్జ్‌ లీజుల కోసం దరఖాస్తు చేసింది. వెంటనే ఇచ్చేయండి. ఎన్నికల కోడ్‌ (Election Code) వచ్చేలోపే అంతా ముగిసిసోవాలి! ఇదీ సీఎం జగన్‌ సన్నిహిత సంస్థ విషయంలో జరుగుతున్న హడావుడి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రభుత్వ, అటవీ భూముల్లో ఈ సంస్థకు లీజుల కోసం ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో లీజులకు నిరభ్యంతర ధ్రువపత్రాలు ఇవ్వాలని, అటవీ భూముల్లో డీజీపీఎస్‌ సర్వే కోసం అనుమతించాలంటూ ఆదేశాలొచ్చాయి.

షిర్టీసాయి ఎలక్ట్రికల్‌ సంస్థకు (Shirdi Sai Electrical Company) వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్ష కోట్ల వరకు విలువ చేసే వివిధ ప్రాజెక్టులు కేటాయించింది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఉన్న ఇండోసోల్‌ సంస్థ నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద పీవీ సోలార్‌ మాడ్యుల్స్‌ (PV Solar Modules) తయారీ యూనిట్‌ ఏర్పాటుకు దగ్గరుండి అన్ని అనుమతులు ఇచ్చేలా చూస్తోంది. ఆ సంస్థ దరఖాస్తు చేసుకున్న క్వార్ట్జ్‌ లీజులన్నీ మంజూరు చేయాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి గనులశాఖ, అటవీశాఖపై ఒత్తిళ్లు వస్తున్నాయి.

ఉత్పత్తి ప్రారంభించకుండానే ఇండోసోల్ కంపెనీకి 8వేల ఎకరాలు కట్టబెట్టారు: నాదెండ్ల మనోహర్

Government Land to Indosol Company for Lease : నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 లీజుల కోసం ఇండోసోల్‌ సంస్థ దరఖాస్తు చేసింది. వీటిలో 10 అటవీ భూములు కాగా, మిగిలిన 8 ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలోని పామూరు మండలం నాసికాత్రయంబకంలో 24.9 హెక్టార్లు, వగ్గంపల్లిలో 14.3 హెక్టార్లు, ఈస్ట్‌ కొండిగుడ్లపాడులో 23.9 హెక్టార్లలోని ప్రభుత్వ భూముల లీజుకు దరఖాస్తు చేసుకుంది. అలాగే కనిగిరి మండలంలోని మూడుచోట్ల ప్రభుత్వ భూముల్లో లీజులు కోరుతోంది. వాటికి సంబంధించి నిరభ్యంతర పత్రాలు జారీ చేయాలని గనులశాఖ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లకు దస్త్రం వెళ్లింది. ఇక నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలం బండగానిపల్లెలో 36.6. ఎకరాలు, ఎస్‌ఆర్‌ పురం మండలం సింగవడ్డిపల్లిలో 45.9 ఎకరాల్లో రెండు లీజుల కోసం దరఖాస్తులు రాగా వీటిలో ఇప్పటికే బండగానిపల్లెలో 36.6 ఎకరాల లీజుకు ఉదయగిరి మండల తహసీల్దార్‌ ఎన్వోసీ కూడా ఇచ్చినట్లు తెలిసింది.

ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ

Lease to Indosol Company : గనులశాఖలో చిన్నతరహా ఖనిజాలకు ఈ-వేలం ద్వారా లీజులు కేటాయించే విధానం ఉంది. అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ భూములు, పట్టా భూములు కాకుండా ఇతర ప్రభుత్వ భూములు అన్నింటా ఈ-వేలం విధానమే అనుసరిస్తారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన పనులు అంటే జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి నిర్మాణ పనులకు అవసరమైన ఖనిజాలకు మాత్రం వేలం లేకుండా నేరుగా లీజుకిస్తారు. ఇండోసోల్‌ సీఎంకు సన్నిహిత సంస్థ కావడంతో నేరుగా లీజులు కేటాయించేలా వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేపిటివ్‌ వినియోగం పేరిట రామాయపట్నం వద్ద ఏర్పాటు చేసే సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ యూనిట్‌కు కార్ట్జ్‌ను వినియోగించాలని అందులో పేర్కొంది. దీంతో ఆ సంస్థ లీజుల కోసం వరుసగా దరఖాస్తులు చేసి, అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తోంది.

ఇండోసోల్‌ నెల్లూరు జిల్లాలోని దామచెర్ల, క్రూసుకొండ, చింతోడు రక్షిత అటవీ ప్రాంతాల్లోని 300 హెక్టార్లలో ఏడు క్వార్ట్జ్‌ లీజుల కోసం దరఖాస్తు చేసింది. ప్రకాశం జిల్లాలోనూ అటవీ ప్రాంతాల్లోని మూడు లీజుల కోసం అర్జీ పెట్టింది. ఈ ప్రాంతాల్లో గనులశాఖ ఇన్‌స్పెక్షన్‌ చేసేలా, డీజీపీఎస్‌ సర్వే చేసేలా అనుమతులు ఇవ్వాలంటూ ఆయా జిల్లాల్లోని అటవీ శాఖ అధికారులపై ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లా గనులశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. ఈ పది ప్రాంతాల్లోనూ డీజీపీఎస్‌ సర్వే కూడా పూర్తయినట్లు తెలిసింది.

సొంత జాగీరులా అస్మదీయ కంపెనీలకు ట్రాన్స్‌కో నిధులు దోచిపెడుతున్నారు: లంకా దినకర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.