IAS Officers Transfers in AP: ఎన్నికల వేళ ఏపీలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్ ల ను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీ రావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బదిలీ కాగా, నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్ గా లక్ష్మీషా బదిలీ అయ్యారు.
- రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌లు బదిలీ
- శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా మంజీర్ జిలానీ
- తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి బదిలీ
- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకట రమణారెడ్డి
- తిరుపతి జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీశ
- నంద్యాల కలెక్టర్‌గా కె.శ్రీనివాసులు
- అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిశక్త్ కిషోర్
- పార్వతీపురం మన్యం జాయింట్ కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్
- పురపాలక శాఖ కమిషనర్‌గా బాలాజీరావు
- శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తమీమ్ అన్సారియా
- విపత్తు నిర్వహణ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్
- జీవీఎంసీ అదనపు కమిషనర్‌గా విశ్వనాథన్
- విశాఖ జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్
- ప్రకాశం జాయింట్ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ
- కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆదిత్య
- పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఇల్లకియా
- సర్వే సెటిల్‌మెంట్ అదనపు డైరెక్టర్‌గా గోవిందరావు
- విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్
- అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా భావన
- ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీగా హరిత
- నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజీంద్రన్
- తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా అదితీ సింగ్
- ప్రభుత్వరంగ సంస్థల విభాగ కార్యదర్శిగా రేఖా రాణి
ఎన్నికల వేడి : రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఓ వైపు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుండగా, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఇక ఓటర్ల తుది జాబితా వెల్లడించి ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జోన్-4 పలువురు తహసీల్దార్లు బదిలీ కాగా, మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.