Huge Response to Nara Lokesh Praja Darbar : కష్టాల్లో ఉన్నవారికి అండగా తానున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం "ప్రజాదర్బార్" కు తరలివచ్చిన ప్రజలకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లో ఉండవల్లి నివాసంలో నిర్వహించిన "ప్రజాదర్బార్" కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Lokesh Praja Darbar in undavalli : "ప్రజాదర్బార్" కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
రోజురోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారినుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేశ్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
నాణ్యమైన భోజనం అందిస్తాం : మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకు నెలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారని, దీనిని 5 వేల నుంచి 10 వేల రూపాయలుకు పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
యువనేత సంచలనం - నారా లోకేష్ ప్రజాదర్బార్ - మంగళగిరి వాసుల సమస్యలకు మోక్షం - Nara Lokesh Praja Darbar
దివ్యాంగులైన తమకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి మండలం చినకాకానికి చెందిన మంచాల సీతారామయ్య, ఓబులమ్మ దంపతులు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్వర్ణకార చేతివృత్తిపై జీవనం సాగించే తాను అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితం అయ్యానని, పెన్షన్ మంజూరు చేయించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన బుట్టా పానకాలు కోరారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తానని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.
లోకేశ్ ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తిన ప్రజా సమస్యలు - Nara Lokesh Praja Darbar