Hudco Help To Tidco Houses in AP : 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించిందనే కక్షతో వైఎస్సార్సీపీ సర్కార్ పాడుబెట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టిడ్కో ఇళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైున రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన హడ్కో ముందుకొచ్చింది.
ఇప్పటి వరకు ఎంతమేర నిర్మించారు? పెండింగ్ పనులు ఎంతెంత ఉన్నాయి? మిగిలిన ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని సమగ్ర వివరాలు అందించాల్సిందిగా హడ్కో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధికారులు రెండురోజుల్లో సమగ్ర నివేదిక అందించనున్నారు. హడ్కో రుణం మంజూరైన వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తారు. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మొదలు పెట్టిన ఇళ్ల నిర్మాణం మళ్లీ ఆయనే పూర్తి చేస్తారని లబ్ధిదారులు ధీమాగా ఉన్నారు.
టిడ్కో ఇళ్లకు హడ్కో చేయూత- రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు హామీ - Tidco Houses in ap
ఐదు సంత్సరాల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. చాలా చోట్ల ఇంటి సామగ్రిని దొంగులు ఎత్తుకెళ్లారు. కొన్ని చోట్ల టిడ్కో ఇళ్ల పరిసరాలు చిట్టడవిని తలపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు అప్పులు తెచ్చి సింగిల్ బెడ్ రూమ్ ఇంటికి 25 వేలు, డబుల్ బెడ్ ఇంటికి 50వేల రూపాయలు చెల్లించారు. గృహ ప్రవేశాలు చేయకుండానే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని లబ్ధిదారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో లక్షా 17వేల టిడ్కో ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దానికి దాదాపు 5 వేల70 కోట్ల రూపాయలమేర ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హడ్కో ఆ రుణం మంజూరు చేస్తే లక్షలాది పేదల నిరీక్షణకు తెరపడనుంది.
తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం - Tidco Houses in AP
"నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. ఆ సమయంలో ఉన్నప్పుడు 25 వేల రూపాయలు చెల్లించాం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లోన్లు పెడితేనే ఇళ్లు ఇస్తామని అన్నారు. లోన్లు కోసం మాకు తెలియకుండా సంతాకాలు చేయించుకున్నారు. తరువాత మాకు ఇళ్లు ఇవ్వలేదు. బ్యాంకులు వాళ్లు మాత్రం డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తున్నారు. డబ్బులు కట్టమని రోజుకు నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. మేము అద్దె ఇంటిలో డబ్బులు చెల్లించుకోలేక పోతున్నాం. సొంత ఇళ్లు లేక చాలా అవస్థలు పడుతున్నాం."- టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
గుడివాడలో వైఎస్సార్సీపీ అక్రమాలు - టిడ్కో ఇళ్ల పేరుతో భారీగా దోపిడీ - Irregularities in Amrit Scheme