ETV Bharat / state

వైసీపీ కవ్వింపుచర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దు: హోంమంత్రి అనిత - law and order at YCP government - LAW AND ORDER AT YCP GOVERNMENT

Home Minister Anitha Comments on Law and Order at YCP Government : జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. వైసీపీ కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందామని విజ్ఞప్తి చేశారు.

Home Minister Anitha Comments on Law and Order at YCP Government
Home Minister Anitha Comments on Law and Order at YCP Government (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 4:52 PM IST

Home Minister Anitha Comments on Law and Order at YCP Government : సైకో జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకు తెలుసన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసారు. గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు.

వైసీపీ కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దు - చట్టం ఎవరికైనా ఒక్కటే : హోంమంత్రి అనిత (ETV Bharat)

ఎక్కడా చూసిన అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, సాధారణ పౌరులపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. అలాగే ఎస్సీలపై దాడులు, హత్యలు జరిగాయని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలే ఇబ్బందులు పడ్డారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన భారీ విజయాన్ని వైసీపీ నేతలు ఇప్పటికీ ఓర్చుకోలేక పోతున్నారని అనిత దుయ్యబట్టారు.

అయిదేళ్లుగా గాడి తప్పిన వ్యవస్థలు-దిక్కులేకుండా పోయిన ప్రజాహక్కులు - law and order in ap

ఏ పార్టీ వారైనా సరే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే సహంచేది లేదన్నారు. తప్పుచేసిన ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హితవు పలికారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు సంయమనం పాటించాలన్నారు. వైసీపీ కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందామని విజ్ఞప్తి చేశారు. జగన్ రాష్ట్రపతికి, హోం మంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రమణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన కేసులు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలని కోరారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల - Three white papers in assembly

గత ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోందన్నారు. అన్ని అంశాలను చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటేనే సగం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టేనని స్పష్టం చేసారు. గతంలో దిశ యాప్​ను మగవాళ్లతోనూ డౌన్ లోడ్ చేయించారని విమర్శించారు. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యా శాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని హోం మంత్రి అనిత వెల్లడించారు.

Chandrababu writes open letter: వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాంధ్ర ప్రదేశ్ గా మారిపోయింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.