ETV Bharat / state

ధర్మవరంలో ఉద్రికత్త - బీజేపీ కార్యకర్తపై కారును ఎక్కించిన కేతిరెడ్డి వర్గీయులు - High Tension in Dharmavaram - HIGH TENSION IN DHARMAVARAM

Tension in Dharmavaram Sub Jail : ధర్మవరంలో బీజేపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ధర్మవరం సబ్‌జైలులో ఖైదీ పరామర్శకు కేతిరెడ్డి వచ్చారు. అప్పుడు అటువైపు వస్తున్న బీజేపీ నేత హరీశ్​ వాహనశ్రేణికి అడ్డుగా కేతిరెడ్డి శ్రేణులు వాహనాలు అడ్డుగా పెట్టారు. ఈ విషయంపై మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్దిచేప్పేందుకు యత్నిస్తున్నారు.

High Tension in Dharmavaram
High Tension in Dharmavaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 7:56 PM IST

Updated : Sep 23, 2024, 8:12 PM IST

Clash Between YSRCP and BJP Leaders Dharmavaram : సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. కమలం పార్టీ నేత హరీశ్ తన అనుచరులతో ఆ రోడ్డు మార్గాన వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వర్గీయులు ఆ రహదారిలో వాహనాలను అడ్డుగా పెట్టారు. ఈ నేపథ్యంలోనే వాహనాలు అడ్డు తొలగించాలని కమలం కార్యకర్తలు వారిని కోరారు.

ఈ విషయం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి డ్రైవర్‌ను హరీశ్‌ వర్గీయులు చితకబాదారు. కేతిరెడ్డి దురుసుగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్త ప్రతాపరెడ్డి కేతిరెడ్డి వర్గీయులను అడ్డుకునేందుకు యత్నించారు. ప్రతాపరెడ్డిపై వాహనాన్ని ఎక్కించడంతో ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డారు. ధర్మవరం సబ్‌జైలులో ఖైదీ పరామర్శకు కేతిరెడ్డి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.

EX MLA Kethireddy VS Harish : ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి నుంచి వారంతా ధర్మవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు . ఇరువర్గాల ఘర్షణతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నుంచి అదనపు బలగాలు ధర్మవరానికి రప్పించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలి : మరోవైపు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ఆయన రౌడీలను వెంటేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ధర్మవరంలో అరాచకాలు చేసిన కేతిరెడ్డిని ప్రజలు ఓడించారని చెప్పారు. ఆ ఓటమి జీర్ణించుకోలేక గుండాలను వెంట బెట్టుకొని దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇవాళ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి కేతిరెడ్డిని కఠినంగా శిక్షించాలన్నారు.

తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం - అడిషనల్ ఎస్పీపై రెచ్చిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి - Pedda Reddy Comments On Police

బూతులతో విరుచుకుపడ్డ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి- బీజేపీ అభ్యర్థిపై వ్యక్తిగత దూషణలు - Ketireddy Controversial Comments

Last Updated : Sep 23, 2024, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.