High Court on 2018 Group1 Exam: 2018 గ్రూప్-1 ఉద్యోగులను తొలగించొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏప్రిల్ 18 వరకు ధర్మాసనం పొడిగించింది. గ్రూప్-1 పరీక్ష రద్దుపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ సవాల్ చేసింది. గ్రూప్-1 పరీక్ష రద్దుపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చేనెల 18కి వాయిదా వేసింది.
AP HC Verdict on 2018 Group-1 Mains: 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండో సారి, మూడో సారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్దమని హైకోర్టు తీర్పు నిచ్చింది. మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మెయిన్స్ పరీక్షను తాజాగా నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మొదట డిజిటల్‌గా మూల్యాంకనం చేశారు. దీనిపై పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.
వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు
హైకోర్టు ఆదేశాల ప్రకారం పేపర్లను మాన్యువల్‌గా(చేతితో దిద్దడం) మూల్యాంకనం చేశారు. ఈ క్రమంలో గతంలో అర్హత పొందిన కొందరు అభ్యర్ధులు అనర్హులుగా మారారు. దీంతో అర్హత కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మెయిన్స్ అభ్యర్ధుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ఆధారంగా అర్హత సాధించిన వారందరికీ ప్రభుత్వం ఇప్పటికే పోస్టింగ్‌లు సైతం ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వటంతో చర్చనీయాంశంగా మారింది.
ఆందోళన వద్దు : 2018 గ్రూప్-1 అంశంలో హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలు కాపాడతామని ప్రకటించింది. ఉద్యోగుల తరఫున న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రభుత్వం తెలిపింది.
నిరుద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసా? - తీవ్ర నిరాశలో యువత
వైసీపీ నాయకులతో ఏపీపీఎస్సీ బోర్డు: గ్రూప్-1 నోటిఫికేషన్ పూర్తిగా అక్రమాలతో ఉందని నిరుద్యోగ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్ అన్నారు. 2021 ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన ఫలితాలను 2021 జూన్‌లో ఇచ్చారన్నారు. 49 వేల ఓఎంఆర్ షీట్లను ఏపీపీఎస్సీ పూర్తిగా మార్చేసి వారికి కావాల్సిన వారికి పోస్టులను ఇచ్చిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పులోనే పూర్తిగా స్పష్టత ఉందని అన్నారు. వైసీపీ నాయకులతో ఏపీపీఎస్సీ బోర్డును పూర్తిగా నింపేశారని విమర్శించారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిపై సీబీఐ విచారణ జరిపి ఇందులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.