High Court Hearing on Cases Filed Against Secretariat Women Police: సచివాలయ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పేర్కొంటూ పోలీసు విధులను అప్పగించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు ప్రభుత్వ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో మూడు వారాల్లో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు మరోసారి విచారణ చేసింది.
మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పేర్కొంటూ ప్రభుత్వం జారీచేసిన జీవోలు, తీసుకొచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరావు, పలువురు మహిళ సంరక్షణ కార్యదర్శులు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. మహిళ సంరక్షణ కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగిస్తున్నారన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ - విజయవాడ యువతి ఆచూకీ లభ్యం - Vijayawada Police on Girl Missing