ETV Bharat / state

లావణ్యవి ఆరోపణలే - నా దగ్గర ఆధారాలున్నాయి: హీరో రాజ్​ తరుణ్​ - Hero Raj Tarun Reaction on lavanya

Hero Raj Tarun Reaction on Lavanya Statements : లావణ్య చేసింది ఆరోపణలని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వాటితో న్యాయబద్ధంగా పోరాడతానని హీరో రాజ్​తరుణ్​ తెలిపారు. లావణ్య వివాదంపై స్పందించిన ఆయన తన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని అన్నారు.

Hero Raj Tarun Reaction on Lavanya Allegations
Hero Raj Tarun Reaction on Lavanya Allegations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 10:38 PM IST

Updated : Jul 31, 2024, 10:55 PM IST

Hero Raj Tarun Reaction on Lavanya Allegations : లావణ్యతో వివాదం తననే కాదు తన కుటుంబాన్ని కూడా తీవ్రంగా బాధించిందని యువ కథానాయకుడు రాజ్ తరుణ్ అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న లావణ్యపై న్యాయపోరాటం చేస్తానని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. లావణ్య ఆరోపణల్లో నిజం లేదని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. తన తాజా చిత్రం 'తిరగబడరా స్వామి' చిత్రం ఆగస్టు 2న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్​ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​కు మాల్వీ మల్హోత్రాతో కలిసి రాజ్ తరుణ్ హాజరయ్యారు.

ఈ నెల 18లోపు విచారణకు హాజరవ్వండి - హీరో రాజ్​తరుణ్​కు పోలీసుల నోటీసులు - Police Issued Notices to Raj Tarun

ఎందుకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు : లావణ్య ఆరోపణలపై పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, వాటికి సమాధానం చెప్పినట్లు పేర్కొన్న రాజ్ తరుణ్ లావణ్య చేస్తున్న గర్భస్రావం ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని లావణ్య లాంటి వాళ్లు లబ్ధి పొందాలని చూస్తున్నారని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

మరోవైపు ఇదే వివాదంపై స్పందించిన నటి మాల్వీ మల్హోత్రా లావణ్య ఒక క్రిమినల్​గా తయారైందని ఆరోపించింది. ప్రెస్ మీట్ జరుగుతుండగా ప్రసాద్ ల్యాబ్​కు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్​ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రివ్యూ థియేటర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

"మన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని ఇంత చేస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది. నేను మనిషినే కదా. నేను ఎఫెక్ట్​ అవుతాను. నాకు వాళ్లలాగ ఆరోపణలు చేసి, మీడియా ట్రయల్స్​ చేసే ఉద్దేశం అస్సలు లేదండి. ఆరోపణలు చేసే వారు బయటకు వచ్చి మాట్లాడతారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. లీగల్​గా వెళ్తా. ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఆరోపణలు, మాటలు విన్నారు కానీ ఒక్కరోజైనా ఆధారాలు అడిగారా?" - రాజ్​తరుణ్​, హీరో

లావణ్య తీవ్ర ఆరోపణలు : కాగా రాజ్​తరుణ్​ తనకు ప్రపోజ్​ చేసి 2014లో పెళ్లి చేసుకున్నాడని, తన కుటుంబం రూ.70 లక్షలు ఇచ్చిందని, 2016లో తాను గర్భం దాల్చితే రాజ్​తరుణ్​ అబార్షన్​ చేయించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్​ తన నుంచి దూరమయ్యాడని తెలిపింది. దీంతో పోలీసులు అతనిపై, మాల్వీ మల్హోత్రపై కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. జులై 18లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు వెల్లడించారు. బీఎన్​ఎస్​ఎస్​ 45 కింద రాజ్​తరుణ్​కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్​ తరుణ్​పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

'రాజ్‌ లేని లైఫ్​​ నాకొద్దు - ఆత్మహత్య చేసుకుంటున్నా'- తన అడ్వొకేట్​కు లావణ్య సందేశం - Raj Tarun Case Updates

రాజ్​తరుణ్ లావణ్య వ్యవహారంలో నాకేంటి సంబంధం : నటి మాల్వీ మల్హోత్రా - Actress Malvi Malhotra Reacts

Last Updated : Jul 31, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.