ETV Bharat / state

బంగాళాఖాతంలో అల్పపీడనం - రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - AP Weather Update

Weather Update in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండురోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. శుక్రవారం కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Weather Update in AP
Weather Update in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 10:44 PM IST

Weather Update in Andhra Pradesh: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న రెండురోజుల్లో అది మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, నంద్యాల శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంక పొంగి పొర్లుతున్నాయి.

అల్పపీడన ద్రోణి ప్రభావం - కురుస్తున్న వర్షాలు - Heavy Rains in Andhra Pradesh

అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు. అత్యవసర సాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగం, పార్వతీపురం మన్యం, ఏలూరు, శ్రీ సత్యసాయిజిల్లా తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 44 పాయింట్‌ 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

వాగులో కొట్టుకుపోయిన కారు - అందరూ సేఫ్​ - Car washed away in river

ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరుతో పాటు మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుసింది. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ప్రవహిస్తోంది. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలో కొలువుతీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గమధ్యంలో వాగులు పొంగుతున్న నేపథ్యంలో ఆలయ దర్శనాన్ని కమిటీ సభ్యులు నిలిపివేశారు.

గోదావరి జిల్లాలో వర్షాలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Heavy Rains in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.