ETV Bharat / state

బుడమేరు బురదలో వస్త్రాలు​ - కన్నీటి తడిలో విజయవాడ వ్యాపారులు - Heavy Losses to Textile Traders - HEAVY LOSSES TO TEXTILE TRADERS

Heavy Losses to Textile Traders Due to Floods in Vijayawada : బుడమేరు వరద తగ్గినా బాధితుల కష్టాలు తీరడంలేదు. అనుకోని వరదల కారణంగా విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ విపత్తుతో వేలాది మంది రోడ్డుపాలయ్యారు. సర్వం కోల్పోయిన వారికి ఇప్పుడ ప్రభుత్వ సాయమే దిక్కు. చిరు వ్యపారులు లక్షల్లో నష్టపోయామని వాపోతున్నారు. ఇక వస్త్ర వ్యాపారుల వ్యథ వర్ణనాతీతంగా ఉంది.

heavy_losses_to_textile_traders_due_to_floods
heavy_losses_to_textile_traders_due_to_floods (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 10:47 AM IST

Heavy Losses to Textile Traders Due to Floods in Vijayawada : విజయవాడను వరద ముంపు వీడినా ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో వస్త్ర వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద నీటిలో దుస్తులు పూర్తిగా నానిపోయి పాడైపోగా వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
విజయవాడలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ఏ వస్త్రదుకాణం వైపు చూసినా బురదమయమైన దుస్తులను ఆరబెడుతూ లబోదిబోమంటున్న బాధితులే కనిపిస్తున్నారు. సింగ్ నగర్, ప్రకాశ్ నగర్, పైపుల రోడ్డు ప్రాంతాల్లోని వస్త్ర దుకాణాల్లో వరద బీభత్సానికి సరకును బయటకు తెచ్చే అవకాశం లేకుండా పోయింది. దుకాణాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల వరకు నీరు చేరడంతో దుస్తులను కాపాడుకోలేకపోయారు. క్లాత్ సెంటర్లతోపాటు రెడీమేడ్ దుకాణాలకు తీవ్రనష్టం వాటిల్లింది. సుమారు 50 నుంచి 60శాతం సరకు వస్త్ర సామగ్రి పాడైందంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ జనజీవనం సాధారణం- ఇక కుదుటపడ్డట్టే! - Normal Conditions In Vijayawada

'షాప్​లోకి రెండడుగుల నీరు చేరింది. బట్టలు అన్నీ మునిగిపోయాయి. ఫర్నీచర్​ కూడా పాడైపోయింది. మూడు లక్షల వరకు నష్టపోయా. ఇప్పుడు కొన్ని బట్టలు ఉతికిస్తున్నాం. అయినా ఎవరూ కొనే అవకాశం లేదు. పండుగ సీజన్​ కదా అని చాలా సరకు తెచ్చి పెట్టుకున్నాం. అంతా బురదలో కలిసిపోయింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి మరో దారి లేదు.' - విజయవాడ వస్త్ర వ్యాపారులు

Garments Damaged by Flood Mud : పండుగ సీజన్లలో దుకాణాల్లో రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో దసరా సీజన్‌ కోసం భారీగా సరుకును ముందస్తుగా తెప్పించారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి మరీ కొన్నారు. వాటిని అమ్మి అప్పులు తీరుద్దాం అనుకుంటే సరుకంతా బురద పాలైంది. పండుగ దగ్గర పడటంతో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టాలన్నా రుణం ఇచ్చేవారు లేరని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. బుడమేరు వరద దెబ్బ నుంచి కోలుకోవాలంటే మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. తమ జీవితాలు గాడిలో పడాలంటే ప్రభుత్వ సహకారం తప్పదని వ్యాపారులు అంటున్నారు.

మున్నేరులో కన్నీటి ప్రవాహం- వరదలో కొట్టుకుపోయిన 'వివాహ' సంతోషాలు - Massive Loss by Floods in Khammam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.