ETV Bharat / state

ఏపీ మెట్రోరైలు ఎండీగా రామకృష్ణారెడ్డి - AP Metro Rail MD Appointed by Govt

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 4:31 PM IST

Updated : Aug 2, 2024, 6:49 PM IST

Govt Orders Appointing Ramakrishna Reddy as MD of AP Metro Rail: ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా N.P.రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేషమైన అనుభవం ఉన్న రామకృష్ణారెడ్డిని మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ap_metro_rail_md
ap_metro_rail_md (ETV Bharat)

Govt Orders Appointing Ramakrishna Reddy as MD of AP Metro Rail: ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్​పీ. రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేషమైన అనుభవం ఉన్న రామకృష్ణారెడ్డిని మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా నియమిస్తున్నట్లు వివరించింది. మూడేళ్ల పాటు ఆయన ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేషమైన అనుభవం ఉన్న ఆయన్ను మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా నియమిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణా రెడ్డి పని చేశారు. ప్రస్తుత ఎండీ జయ మన్మథరావును రిలీవ్ చేస్తూ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు.

Chandrababu on Visakha Metro Rail Project : విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్​హెచ్​ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది.

పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO

Vizag Metro Project Status : విశాఖలో గత దసరా నాడు మెట్రో రైలు కార్యాలయం ప్రారంభించినా ఇప్పటివరకు అతీగతీ లేదు. పరిస్థితి ఇలా ఉంటే విశాఖను ఉద్ధరించేస్తామంటూ అక్కడికే మకాం మారుస్తున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించారు. అందుకోసం రుషికొండను బోడిగుండు (Rushikonda )చేసి వందల కోట్లు ఖర్చుచేసి నిర్మాణాలు సైతం చేశారు. కానీ విశాఖ మెట్రో కోసం ఒక్క అడుగూ వేయలేదు. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ఏర్పాటుపై విభజన చట్టంలో చెప్పినా వైఎస్సార్సీపీ సర్కార్‌ పట్టించుకోవడం లేదు. 46.42 కిలోమీటర్ల మొదటి దశను 2020-24 మధ్య, 77.31 కిలోమీటర్ల రెండో దశను 2023-28 మధ్య, 16.40 కిలోమీటర్ల మూడో దశను 2027-29కి పూర్తి చేస్తామని మూడున్నరేళ్ల క్రితం మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఎలాంటి కదలికా లేదు.

రాజధాని అమరావతిలో ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల పరిశీలన - IIT Teams Visit Amaravati Today

నాబార్డు నిధులను దారి మళ్లించిన వైఎస్సార్సీపీ సర్కార్​ - నిలిచిన బాపట్ల వైద్య కళాశాల నిర్మాణం - Medical College Construction

Last Updated : Aug 2, 2024, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.