ETV Bharat / state

నడిసంద్రంలో మత్స్యకారులకు తోడుగా ఇస్రో పరికరం - Transponders on fishermen boats

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 9:45 PM IST

Government Installs Transponders on Fishermen Boats సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారంతో అభివృద్ది చేసిన పరికరాన్ని ఉచితంగా మత్స్యకారులకు అందించేందుకు సిద్దమవుతోంది. వేటకు వెళ్లిన వారు కల్లోల కడలిలో చిక్కుకుపోతుంటే, వారి ఆచూకీని క్షణాల్లో గుర్తించి వారిని రక్షించే వెసులుబాటు ఈ పరికరంతో లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Government Installs Transponders on Fishermen Boats
Government Installs Transponders on Fishermen Boats (ETV Bharat)

Government Installs Transponders on Fishermen Boats : మత్స్యకారుల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నడి సంద్రంలో ప్రతికూల, ఆపద సమయాల్లో మత్స్యకారుల ప్రాణల రక్షణ కోసం వారి బోటుకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్ పౌండర్లు అమర్చుతున్నారు. దీంతో బోట్లు సముద్రంలో ఎక్కడ ఉన్నా, శాటిలైట్స్ ఇట్టే గుర్తిస్తాయి. అలాగే తుఫాను లాంటిది వస్తే, అప్పుడు ఆ జాలర్లు ఎక్కడున్నారో, వారి పడవ ఎక్కడుందో ఇస్రో గుర్తించి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వగలదు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'మత్స్యరంగంలో స్పేస్ టెక్నాలజీ' వినియోగంపై ఈరోజు (శుక్రవారం) విశాఖపట్నంలోని భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్కొన్నారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలని మత్స్యకారుల వినతి- స్పందించిన హోంమంత్రి - Bapatla Fisermen Meet HomeMinister

మత్స్యకారులకు రక్షణ : ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, ఆగస్టు 23న జరుగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలకు ముందస్తూ కార్యకలాపాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ట్రాన్స్ పౌండర్లను ప్రతి మోటరైజ్డ్, మేకనైజ్డ్ బోటు ఓనర్లు అందరూ వినియోగించాలని అన్నారు. ఈ ట్రాన్స్ పౌండేర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందిస్తున్నట్లు తెలిపారు. బోటు యజమానులందరూ మత్స్యశాఖ సహకారంతో వారి బోటులకు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాని కోరారు. ఇది వాతావరణం, చేపల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుందని తెలిపారు. అలాగే తుఫాను హెచ్చరికలను ఈ పరికరం ద్వారా జారీ చేస్తుందని వివరించారు. పడవలోపల అమర్చిన బజర్ నొక్కడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించవచ్చాని తెలిపారు. కావున మత్స్యకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఇస్రో కృషిని అభినందిచాలి : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న కార్యకలాపాలు సామాన్య ప్రజలకు మేలు కలిగేలా చేస్తున్న కృషిని అందరూ అభినందించాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు లేకపోతే అభివృద్ధిలో వెనుకపడతామని తెలిపారు. కోవిడ్ సమయంలో మన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి రూపొందించిన వ్యాక్సిన్ వలన మనతో పాటు ఎన్నో దేశాలకు సరఫరా చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటుచేసిన మత్స్య మ్యూజియం చాలా బాగుందని, ఇది సామాన్య ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ డి.బామిరెడ్డికి తెలిపారు.

బోటు యజమానులకు అవగాహన : ఈ సందర్భంగా ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి డి. బామిరెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా ఈరోజు మత్స్యకార సోదరులకు ఉచితంగా అందించనున్న ట్రాన్స్ పౌండేర్ల వినియోగంపై బోటు యజమానులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా ఎస్ఎంఎస్ సంకేతాలు, అత్యవసర సంకేతాలు, సముద్ర సరిహద్దులు మొదలగు వివరాలు పొందవచ్చని అన్నారు. జిల్లాలో మొత్తం 350 మోటార్రైజ్డ్ ,760 మేకనైజ్డ్ బోటులకు ఈ సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు.

'ఎక్కడవేసిన జెట్టీ అక్కడే'- గంగపుత్రులను వంచించిన జగన్​ సర్కార్ - Floating Jetty in Chintapally

అంధకారంలో మత్స్యకారుల జీవితాలు - ఆశలన్నీ కూటమి ప్రభుత్వపైనే! - Fishermen Faced Problem

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.