ETV Bharat / state

"ప్రకృతి సాగు పుడమికి శ్రీరామరక్ష" - మాస్టర్‌ ట్రైనర్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్న ప్రభుత్వం

ప్రకృతి వ్యవసాయం పెంచేందుకు కృషి చేస్తున్న ఏపీ సాధికార సంస్థ - ఎన్పీఎం దుకాణదారులకు శిక్షణ

overnment_giving_state_level_training_to_npm_shopkeepers
overnment_giving_state_level_training_to_npm_shopkeepers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2024, 1:09 PM IST

Government Giving State Level Training To NPM Shopkeepers : రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు ఏపీ సాధికార సంస్థ తీవ్రంగా శ్రమిస్తోంది. NPM (Non Pesticide Manage) దుకాణాల ద్వారా సహజ వనరులను అందించేందుకు దుకాణదారులకు మాస్టర్‌ ట్రైనర్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

ఎన్పీఎం దుకాణదారులకు రాష్ట్రస్థాయి శిక్షణ : ఏలూరు జిల్లా గుండుగొలనుకుంటలోని ఒబిలిశెట్టి గోపాలకృష్ణ మూర్తి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో NPM దుకాణదారులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు, కషాయాలు, అస్త్రాల తయారీలో చెయ్యితిరిగిన గోపాలకృష్ణను మాస్టర్‌ ట్రైనర్‌గా నియమించి శిక్షణ అందిస్తున్నారు. కషాయాల తయారీ, వాటి వినియోగం, పనితీరు, మార్కెటింగ్ చేయడం వంటి పలు అంశాలపై NPM దుకాణదారులకు గోపాలకృష్ణ తర్ఫీదునిస్తున్నారు.

వ్యవసాయమంటే దండగ కాదు - పండగ అని నిరూపిస్తున్న యువ రైతులు

సమాజాన్ని బాగుచేయడమే ముఖ్యఉద్దేశం : కషాయాల తయారీలో NPM దుకాణదారులకు కాస్త అవగాహన ఉన్నా వాటిని కచ్చితత్వంతో తయారు చేయడం, ముడిసరుకు ఎంత మోతాదులో వాడాలి, దీర్ఘకాలిక తెగుళ్లు, వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులకు ఎలాంటి కషాయాలు వాడాలనే విషయాలపై ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన NPM దుకాణదారులు ఇక్కడ కషాయాల తయారీని ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నారు. సందేహాలు నివృత్తి చేసుకుంటూ నైపుణ్యానికి మరింత పదును పెట్టుకుంటున్నారు. 2018లో 15 మందితో మొదలైన ఈ శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికి 100 వరకూ పూర్తయ్యాయని మాస్టార్‌ ట్రైనర్‌ గోపాలకృష్ణమూర్తి అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సమాజాన్ని బాగుచేయడమే ఈ శిక్షణ కార్యక్రమాల ముఖ్యఉద్దేశమని చెప్పారు.

"అన్నిరకాల పురుగులకు సంబంధించిన కషాయాలను ఎలా తయారు చేయాలి? ఎలా వాడుకోవాలో శిక్షణ ఇస్తున్నాం. NPM దుకాణదారుల నుంచి కూడా సూచనలను తీసుకుని సేంద్రియ వ్యవసాయంలో నాణ్యతను పెంచుతున్నాం. చాలా మంది రైతులకు ప్రకృతి వ్యవసాాయం చేయాలని ఉన్నప్పటికీ ఎటువంటివి వాడాలో తెలియదు. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశం సమాజాన్ని, భూమిని, ప్రకృతిని మార్చడమే." - గోపాలకృష్ణమూర్తి, మాస్టర్ ట్రైనర్

ఉద్యోగం కోల్పోయినా మరో వంద మందికి ఉపాధి చూపిన సురేశ్ - 'సుగంధ' సేద్యంతో భారీగా ఆదాయం

Students Farming: అగ్రికల్చరల్ విద్యార్థుల పొలం బాట.. అటు చదువు.. ఇటు వ్యవసాయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.