Government Activity to Issue Student Certificates : ఫీజు బకాయిల కారణంగా కళాశాలల్లో నిలిచిపోయిన విద్యార్ధుల సర్టిఫికెట్లను తిరిగి ఇప్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. గత ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన నిధులను భారీగా పెండింగ్ పెట్టడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. విద్యాశాఖ అధికారులు త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి : వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్ధులకు చెల్లించాల్సిన కళాశాలల ఫీజులను బకాయి పెట్టడంతో చదువులు పూర్తైనా విద్యార్ధులకు ఆయా కళాశాలలు సర్టిఫికెట్లను జారీ చేయడం లేదు. బకాయిలు చెల్లించాలంటూ విద్యార్ధులపైనే ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్ధులకు చెందిన ధ్రువపత్రాలు కళాశాలల్లో ఉండిపోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. గత సర్కారు 3 వేల 480 కోట్ల రూపాయల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎగ్గొట్టినట్టు అంచనా.
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు - ఆ కాలేజీల్లో ఎంతంటే? - ENGINEERING FEES in ap
కళాశాలల్లో సర్టిఫికెట్ల : ఈ క్రమంలో తక్షణం విద్యార్ధుల సర్టిఫికెట్లను తిరిగి ఇప్పించేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపట్టారు. ఆ మేరకు అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆధికారులను ఆదేశించారు. మొత్తం 8 లక్షల మంది బాధిత విద్యార్ధుల సర్టిఫికెట్లను ఒకేసారి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడాలని లోకేశ్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమావేశం త్వరలోనే జరుగనుంది. 6 విడతల్లో విద్యాదీవెన బకాయిలను చెల్లించేలా వారిని ఒప్పించనున్నట్టు సమాచారం.
కూటమి సర్కారు కసరత్తు : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా కాలేజీలకు చెల్లించే విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని లోకేశ్ అధికారులకు ఆదేశించారు. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాల్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకూ తగిన కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. ఉన్నత విద్యాసంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, ప్రవేశాలు, కోర్టు కేసుల వివరాలు తదితర అంశాలన్నింటిని డ్యాష్‌బోర్టులో పొందుపర్చాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ, ఫీజుల ఏ మేరకు ఉండాలి లాంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
ఇంజినీరింగ్ కళాశాల ఆస్తులపై జగన్ బంధువు కన్ను- బెదిరించి 7.5ఎకరాలు కబ్జా - YSRCP Leader Grab lands in Kadapa