ETV Bharat / state

పెద్దల తీర్పు అనుకూలంగా రాదేమోనని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - ప్రేయసి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం - Lovers Suicide AttemptGirlFriendDie - LOVERS SUICIDE ATTEMPTGIRLFRIENDDIE

Girlfriend Dies in Lovers Suicide Attempt: తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో, లేదోనని ఆందోళన చెందిన ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రేమికురాలు మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది.

Girlfriend Dies in Lovers Suicide Attempt
Girlfriend Dies in Lovers Suicide Attempt (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 5:10 PM IST

Lovers Suicide Attempt in Mahabubabad: ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ప్రేమికురాలు మృతి చెందగా, ప్రేమికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన ప్రవళికకు 3 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజులకే భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన రవీందర్​తో పరిచయం ఏర్పడింది. అది ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది.

రెండు నెలల క్రితం ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు కనిపించడం లేదంటూ వీరి తల్లిదండ్రులు పోలీస్​ స్టేషన్​లలో ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం పోలీసులు శ్రీకాకుళం వెళ్లి వారిద్దరిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికి వచ్చిన వాళ్లు రవీందర్ ఇంట్లోనే ఉంటున్నారు.

రాజమహేంద్రవరంలో దారుణం - బ్రిడ్జ్ పై నుంచి దూకి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య

ఆందోళనకు గురై ఆత్మాహత్యాయత్నం : ఈ క్రమంలో ఈ వివాదంపై ఆదివాసీ కుల కట్టుబాట్ల ప్రకారం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరగనుంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందో రాదోనని ఆలోచించి ఆందోళనకు గురైన ప్రేమికులు, ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు చూసేసరికి ప్రవళిక మృతి చెందగా, రవీందర్​ ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డాడు. ప్రేయసి మృతి చెందిందని తెలిసి రవీందర్ మళ్లీ​ కత్తితో మెడ, మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు విచారణ చేపట్టారు. రవీందర్​ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన గుండగాని సంజయ్ (25), ఆ గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి (23) ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఆ ప్రేమికులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, చావైనా బతుకైనా కలిసే ఉందామని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

భార్యను కొట్టిన భర్త- భయంతో కాసేపటికే ఆత్మహత్య!

ప్రియురాలిపై ప్రియుడి దాష్టికం- చివరకు తనే సజీవదహనం - Man Suicide Due to Love Failure

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.