ETV Bharat / state

ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన స్కార్పియో - నలుగురి దుర్మరణం - 4 Died In Accident At Gadwal

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 7:10 AM IST

AP Residents Died In Road Accident : తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

4 Spot Dead in Car Accident at Jogulamba Gadwal
4 Spot Dead in Car Accident at Jogulamba Gadwal (ETV Bharat)

4 Spot Dead in Car Accident at Jogulamba Gadwal : తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ నుంచి హైదరాబాద్​వైపు వెళ్తున్న స్కార్పియో కార్ ముందుగా వెళుతున్న లారీని వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద సమయంలో కారులో డ్రైవర్​ సహా ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వీరిలో డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మరణించగా, మిగతా వారందరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఆంధ్రప్రదేశ్​లోని ఆళ్లగడ్డకు చెందిన వారిగా భావిస్తున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి- ముగ్గురికి తీవ్ర గాయాలు - Tractor Hit Bolero Two Died

150అడుగుల లోయలో పడ్డ యాత్రికుల బస్సు- 22మంది మృతి, 60మందికి గాయాలు - Road Accident Jammu

లోయలో పడ్డ బస్సు- 28మంది మృతి- మరో 22మందికిపైగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.