ETV Bharat / state

ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రభుత్వాలు, కోర్టులు తెలుగులో ఇవ్వాలి : వెంకయ్యనాయుడు - Telugu Language Day Celebrations

Venkaiah Naidu Participated in Telugu Language Day Celebrations : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇక నుంచి తెలుగు వారందరూ మాతృభాషలోనే మాట్లాడుతామనే ప్రతిన తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. న్యాయస్థానాల్లో కూడా వాదనలు, తీర్పులను సైతం తెలుగులోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Venkaiah Naidu Participated in Telugu Language Day Celebrations
Venkaiah Naidu Participated in Telugu Language Day Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 5:03 PM IST

Venkaiah Naidu Participated in Telugu Language Day Celebrations : తెలుగు భాషను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే విడుదల చేయాలని సూచించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో తొలి తెలుగు శాసనాలను పరిశీలించిన వెంకయ్య నాయుడు వాటిని సంరక్షించాలని కోరారు. క్రీస్తు శకం 575లో చోళరాజు ధనుంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం కలమల్లలో వెలుగు చూసిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తెలుగు భాష దినోత్సవాన్ని అక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్ ఘన స్వాగతం పలికారు.

తెలుగు భాషకు వన్నెతెచ్చిన గిడుగు బాటలోనే పయనిస్తున్నామా - మరి లోపం ఎవరిది? - Telugu Language Day 2024

తెలుగువారికి నాలుగో స్థానం : ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. న్యాయస్థానాల్లో కూడా వాదనలు, తీర్పులు సైతం తెలుగులోనే ఉండాలనీ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారు నాలుగో స్థానంలో ఉన్నారని.. ఇంగ్లీష్ మోజులో పడి తెలుగును మర్చి పోతున్నారన్నారని తెలిపారు. అమ్మ భాష కళ్లు లాంటిది.. పరాయి భాష కళ్లజోడు వంటిదని తెలిపారు. ప్రతి ఇంట్లోనూ తెలుగులోనే మాట్లాడే విధంగా ఉండాలన్నారు. అలాగే మాతృభాషను కాపాడటానికి మీడియా ప్రధాన భూమిక పోషించాలన్నారు. శాసనాలంటే రాళ్లు రప్పలు కాదు, అవి మన చరిత్రను తెలిపేవని గుర్తుచేశారు. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలన్నారు. కలమల్ల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని వెంకయ్యనాయుడు తెలిపారు.

తెలుగు వెలగాలి - తెలుగు భాష వర్థిల్లాలని కోరుకుంటూ పనిచేద్దాం : సీఎం చంద్రబాబు - Telugu Language Day 2024

ఘనంగా తెలుగు భాష దినోత్సవం : విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఉపాధ్యాయ మోర్చా ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కవి, సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భాషాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులను సత్కరించారు.

తెలుగు భాష మనసుల్ని దగ్గర చేస్తుంది : తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలుగు తల్లి విగ్రహానికి, గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోనికి తీసుకువచ్చిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలిపారు. బహు భాష శాస్త్రవేత్తగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, హేతువాదిగా సమాజానికి రామ్మూర్తి విస్తృత సేవలు అందించినట్లు తెలిపారు. మాతృభాష మనుషుల్లో చైతన్యాన్ని నింపుతుందని, మనసుల్ని దగ్గర చేస్తుందని బుద్ధప్రసాద్ తెలిపారు.

తేనెలొలుకు తెలుగుకు వేడుకలు - తొలి తెలుగు శాసన గ్రామంలో మాతృభాష దినోత్సం - Telugu Language Day Celebrations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.