Fish Market Down: వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారాయి. చెరువుల్లో ఆక్సిజన్ లోపంతో చేపలు, రొయ్యలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో, కొల్లేరు తీర ప్రాంత చెరువుల్లో నీటిపై కళ్లు తేలేస్తూ తేలిపోతున్నాయి. దీంతో రైతులు చేసేదేం లేక అప్పటికప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌కు వాటిని తరలించారు.
Doliphin Dead Body came to Uppada Coast : ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన భారీ డాల్ఫిన్
ఆదివారం ఉదయం నుంచి ఆకివీడులో లాంచీల రేవులోని హోల్‌సేల్ మార్కెట్‌కు సుమారు 150 పైగా లారీలు, వ్యాన్లలో చేపలను రైతులు తీసుకొచ్చారు. సాధారణంగా ఈ మార్కెట్‌కు నిత్యం 35 నుంచి 40 టన్నుల చేపలు వస్తాయి. ఆదివారం మాత్రం 200 టన్నుల సరకు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భారీ ఎత్తున చేపలు తీసుకురావటంతో ఆకివీడు హోల్‌సేల్ చేపల మార్కెట్‌లో ధరలు అమాంతంగా పడిపోయాయి. కిలో రూ.100 పలికే చేప ధర సైజును బట్టి కిలో 10రూపాయల నుంచి రూ.25కు పడిపోయింది.
బీచ్లో భారీగా మరణించిన చేపలు- కిలోమీటరు వరకు ఎటు చూసినా అవే!
కిలో పది రూపాయలే అంటూ పిలిచి మరీ అమ్మడంతో మాంసం ప్రియులు మార్కెట్లో భారీగా క్యూ కట్టారు. రొయ్యలు కూడా 6 టన్నుల వరకు రావడంతో ధర కిలో రూ.180 నుంచి రూ.100-120కి పడిపోయింది. ఉమ్మడి జిల్లా పరిధిలో భీమవరం, ఏలూరు మార్కెట్లకు కూడా వందల టన్నుల చేపలు వచ్చాయి. చేపల ధరలు అమాంతం పడిపోవటంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలను తరలించిన వ్యాను కిరాయి ఖర్చులు రావటం లేదని వాపోయారు.