Father Son Died Due to Electric Shock: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రీ కొడుకులపై విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. యల్లనూరు మండలం దంతలపల్లి గ్రామ సమీపంలోని వాహనం మీద తండ్రీ కొడుకులు వస్తుండగా కరెంటు తీగలు తెగి వారిపై పడ్డాయి. దాంతో షాక్కు గురైన వారు క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. కడప జిల్లాలోని లింగాల మండలం అంకెవారిపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు, రవిగా పోలీసులు గుర్తించారు. ఈ వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో మడుగుపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెగిపడ్డ విద్యుత్ తీగలు - తండ్రీకొడుకులు బలి - CURRENT SHOCK DIED IN ANANTHAPUR
బైక్పై వస్తుండగా ప్రమాదం - విద్యుత్ షాక్తో మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2024, 3:55 PM IST