ETV Bharat / state

నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు - సాగునీరందక లబోదిబోమంటున్న రైతులు

Farmers Struggling for Irrigation in Eluru District మూడేళ్లు సాగునీరు లేక నష్టాలు చవిచూసిన తమకు నీరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు వరి పంటను వేశారు. పంటకు ఢోకా లేదనుకుంటున్న తరుణంలో నీటి సరఫరా నిలిచింది. 20 రోజులుగా నీరందకపోవడంతో వరి పొలాలు నెర్రెలు వస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు.

farmer_suffer
farmer_suffer
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 4:52 PM IST

Farmers Struggling for Irrigation in Eluru District : సాగుకు నీరిస్తామని చెప్పి అధికారులు నట్టేట ముంచారని ఏలూరు జిల్లా రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మూడేళ్లుగా సాగుకు సరిపడా నీరు లేక రైతులు తీవ్ర నష్టాల్ని వారు చవిచూశారు. మరోమారు నీరందకపోతే ఇబ్బందులు తప్పవని భావించి సాగుకు వెనుకడుగేశారు. అధికారులు, స్థానిక నేతలు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో ముందుకొచ్చి వరిసాగు చేశారు. 20 రోజులు సజావుగా నీరందించిన ఆ తరువాత గోదావరి కాలువకు నీరు నిలిచిపోవడంతో పొలాలు బీటలు వారుతున్నాయని, పంట ఎండిపోతోందని అన్నదాతలు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

రైతు ప్రభుత్వమని గొప్పలు - కర్షకులకు తప్పని కన్నీరు

Eluru District : గోదావరి కాలువ కింద సాగవుతున్న వరి పొలాలకు నీళ్లివ్వడంలో అధికారులు ఆదిలోనే చేతులెత్తేశారు. సాధారణంగా రెండో పంటకు సరిపడా సాగునీరు అందదనే ఉద్దేశంతో రైతులు వరిసాగుకు ఆసక్తి చూపలేదు. అయితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నీరిస్తామని హామీ ఇవ్వడంతో ఆశలు చిగురించి రైతులు వరిసాగు చేశారు. ఇక పంటకు ఢోకా లేదనుకుంటున్న తరుణంలో 20 రోజులుగా నీరు నిలిచిపోవడంతో పొలాలు బీటలు వారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని పేదలపై జగన్‌ కపట ప్రేమ - ఎన్నికల కోసమే పెన్షన్‌ పెంపు అంటున్న రైతులు

Dendulur Farmers Struggling : ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని పాలగూడెంలో వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు నిలచిపోయింది. పొట్టపోసుకునే దశలో నీరు లేక కళ్ల ముందే పొలాలు నెర్రెలు తీయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు 30 నుంచి 40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఖర్చు భారమైనా మోటర్లతో నీటిని తోడుకుంటున్నారు. అవి కూడా సరిపడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు.

విద్యుత్ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు- అన్నదాతకు తలకుమించిన పెట్టుబడులు

అధికారులు హామీ ఇవ్వడంతోనే సాగుకు ఉపక్రమించామని ఇప్పుడు నీళ్లివ్వకపోవడంతో చేతికొచ్చిన పంటను నష్టపోతామని లబోదిబోమంటున్నారు. నాలుగైదు రోజుల్లో నీరు అందించగలిగితే కాస్తో కూస్తే పంట చేతికి వస్తుందని, లేనిపక్షంలో ఇక పంట వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికిచ్చే సమయంలో అధికారులు నీరు ఇవ్వకుండా చేతులు ఎత్తివేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టాలను అధికారులు అర్థం చేసుకొని నాలుగైదు రోజుల్లో పంటలకు నీరు అందించాలని రైతులు కోరుకుంటున్నారు. లేకపోతే వరి పంటపై ఆశలు వదులుకోవాల్సిందే అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు నీరిస్తామని హామీ - అందక లబోదిబోమంటున్న ఏలూరు రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.