ETV Bharat / state

రెండో విడత రైతు రుణమాఫీ - రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబురాలు - Rythu Runa Mafi in Telangana - RYTHU RUNA MAFI IN TELANGANA

2nd Phase Crop Loan Waiver in Telangana : కాంగ్రెస్‌ సర్కార్‌ చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయడంతో కర్షకులు, హస్తం పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. రెండో దఫా లక్షా 50 వేల అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా అన్నదాతలు అభివర్ణించారు.

2nd Phase Rythu Runa Mafi in Telangana
2nd Phase Rythu Runa Mafi in Telangana (ETVBharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 7:35 PM IST

Updated : Jul 30, 2024, 7:53 PM IST

2nd Phase Rythu Runa Mafi in Telangana : రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిచేకూర్చడంపై రైతులు సంబరాల్లో మునిగిపోయారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు.

లక్షా 50 వేల అప్పు మాఫీ కావడంతో రైతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదిలాబాద్‌, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని కలెక్టరేట్‌ కార్యాలయాల్లో రైతులు, బ్యాంకర్లు, వ్యవసాయాధికారులతో కలిసి కలెక్టర్లు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని తిలకించారు. తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామని రైతులు అన్నారు.

రైతుల నిరీక్షణకు తెర - రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల - 2ND PHASE CROP LOAN FUNDS RELEASED

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ ప్రకటించడంతో రైతులు హర్షంవ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు.

"ప్రభుత్వం రుణమాఫీ చేయడం వల్ల మాకు చాలా మేలు జరుగుతోంది. మేము దీనికి కట్టే డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొనుక్కోడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మంచి వర్షాలు పడి విత్తనాలు విత్తుకునే సమయానికి రుణమాఫీ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా గుదిబండలా మోస్తున్న ఈ భారాన్ని ప్రభుత్వం ఒక్క విడతతో తీసేసింది. రైతు రుణాల కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు అవుతుందా అనుకునే దానిని చేసి చూపించారు." - రైతులు

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కార్యక్రమం : అధిక వడ్డీల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఈ రుణమాఫీ ప్రక్రియ రైతులకు ఎంతో ఉపయోగ పడుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఆమె రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ తమకు రుణమాఫీ ఎంతో ఉపయోగకరమని, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు.

ఆనందంలో రైతులు : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రుణమాఫీ చేసిందని నల్గొండ జిల్లాలోని రైతులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మొదటి విడతలో రూ.లక్ష, రెండో విడతలో రూ. లక్షా 50 వేల రుణాలను మాఫీ చేయడం హర్షణీయమన్నారు. అధిక వడ్డీలతో ఎంతో ఇబ్బందిపడుతున్న తమకు ఈ రుణమాఫీ ఎంతోగానో లాభదాయకమని రైతులు అన్నారు. పెట్టుబడికి ఈ నగదు ఎంతో ఉపయోగకరమని ఆనందం వ్యక్తం చేశారు.

నేడు రెండో విడత రైతు రుణమాఫీ - రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు - Second Installment Runa Mafi

రేపే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బు - ఈ పథకానికి అర్హులు ఎవరు? - Pratidhwani ON RYTHU RUNA MAFI

Last Updated : Jul 30, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.